యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ABN , Publish Date - May 25 , 2025 | 12:08 AM
యోగాతో ప్రతిఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎస్.భాస్క రరావు అన్నారు.
పార్వతీపురం/ బెలగాం, మే 24 (ఆంధ్రజ్యోతి): యోగాతో ప్రతిఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎస్.భాస్క రరావు అన్నారు. యోగా మాసోత్సవాల్లో భాగంగా శని వారం స్థానిక ఎన్జీవో హోంలో 50 మంది వైద్య ఆరోగ్య సిబ్బందితో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీ నుంచి విచ్చేసిన యోగా గురువు డా.నితిన్ నేతృత్వంలో వర్చువల్ విధానంలో మాస్టర్ ట్రైనీలకు ఇచ్చిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాలకొండ, సాలూరులో కూడా సుమారు 60 మంది మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇస్తున్నారని డీఎంహెచ్‌వో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహన్‌రావు, జిల్లా ఆయుష్ శాఖాధికారి సుశీల, యోగా గురువు మోహన్ తదితరులు పాల్గొన్నారు.
సాలూరు: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక వేంకటేశ్వర కల్యాణమండపంలో మున్సిపల్ కమిషనర్ డీటీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. యోగా గురువులు, మున్సిపల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పాలకొండ: నగర పంచాయతీ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం మొరార్జీదేశాయ్ జాతీయ యోగా సంస్థ నుంచి ఆన్‌లైన్ ద్వారా మాస్టర్ ట్రైనీలకు శిక్షణ అందించారు. పాలకొండ నియోజకవర్గంలో భామిని, సీతంపేట, వీరఘట్టం మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చారు. ఈ మాస్టర్ ట్రైనీలు మండల స్థాయిలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు జనార్థనరావు, అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.