Share News

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

ABN , Publish Date - May 22 , 2025 | 12:19 AM

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అన్నారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
యోగాంధ్ర పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌, జేసీ, ఐటీడీఏ పీవో తదితరులు

- కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

- నెలరోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలు

పార్వతీపురం, మే 21 (ఆంధ్రజ్యోతి): యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అన్నారు. అంతర్జా తీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఆయుష్‌ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర, మాసోత్సవ కార్యక్రమాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక ఆర్‌సీఎం ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వద్ద ఏర్పాటు చేసిన యోగాంధ్ర ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారం భించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్‌ వరకు కొనసాగింది. అనంతరం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌, జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొని యోగాసనాలు చేశారు. యోగాంధ్ర పోస్టర్‌, యాప్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెలరోజుల ముందు నుంచే గ్రామ, మండల స్థాయి యోగా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం పిలుపునిచ్చిందని తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ యోగాంధ్ర యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ శోభిక, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్‌ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, జిల్లా ఆయుష్‌ వైద్యాధికారి బి.సుశీల, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి భాస్కరరావు, జిల్లా ప్రో గ్రాం అధికారులు ఎం.వినోద్‌కుమార్‌, టి.జగన్మోహన్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ సీహెచ్‌ వెంకటేశ్వర్లు, యోగా శిక్షకులు పాల్గొన్నారు.

జిల్లాలో జూన్‌ 21 వరకు ప్రతిరోజూ యోగాంధ్ర కార్యక్ర మాలను నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయా నంద్‌కు వివరించారు. సీఎస్‌ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. యోగాపై లఘు చిత్రాలను రూపొందించి ప్రజల్లో అవగాహన కల్పించనున్నామని కలెక్టర్‌ ఆయనకు చెప్పారు.


WhatsApp-Image-2025-05-21-a.gif

యోగాంధ్ర కార్యక్రమాలు ఇలా..

ఈ నెల 22 నుంచి 27 వరకు యోగా శిక్షకులతో మాస్టర్‌ ట్రైనీలకు శిక్షణ. 28న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, తహసీల్దార్లు పాల్గొనేలా మండల స్థాయి కార్యక్రమం. జూన్‌ 2న రంగోలి. 4న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల సమన్వయంతో అన్ని గ్రామ, వార్డు, మున్సిపల్‌ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు. జూన్‌ 5 నుంచి 7 వరకు స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ. 16న కుటుంబ సభ్యులందరూ యోగాలో పాల్గొనేలా చేయడం. 17న సీనియర్‌ సిటిజన్లతో యోగా. 18, 19 తేదీల్లో 75 సంవత్సరాలు నిండిన వారు యోగాలో పాల్గొనేలా ప్రోత్స హించడం. 17 నుంచి 20 వరకు యోగా పోర్టల్‌లో నమోదు చేసుకున్న వారి వివరాలు, ప్రతిస్పందన సేకరణ. 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తారు.

Updated Date - May 22 , 2025 | 12:19 AM