Yoga యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ABN , Publish Date - Jun 02 , 2025 | 11:50 PM
Complete Health Through Yoga యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందొచ్చని పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్ శ్రీవాత్సవ తెలిపారు. సోమవారం ఐటీడీఏ కార్యాయల ప్రాంగణంలో యోగాంధ్ర నిర్వహించారు.
పార్వతీపురం రూరల్, జూన్ 2(ఆంధ్రజ్యోతి): యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందొచ్చని పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్ శ్రీవాత్సవ తెలిపారు. సోమవారం ఐటీడీఏ కార్యాయల ప్రాంగణంలో యోగాంధ్ర నిర్వహించారు. అధికారులు, మహిళలు, యువత పెద్దఎత్తున పాల్గొని వివిధ ఆసనాలు వేశారు. ఈ నెల 20 వరకు యోగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి పీవో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో ఎ.మురళీధర్, డీఆర్‌డీఏ పీడీ వై.సత్యంనాయుడు, గిరిజన సంక్షేమాధికారి కృష్ణవేణి, జిల్లా పబ్లిక్ హెల్త్ కన్సల్టెంట్ రఘు తదితరులు పాల్గొన్నారు.
విజయవంతం చేయండి
సీతంపేట రూరల్: యోగాంధ్ర మాసోత్సవాలను విజయవంతం చేయాలని సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి కోరారు. సోమవారం లైన్ డిపార్ట్ మెంట్ అధికారులకు యోగా కార్యక్రమంపై పలు సూచనలు చేశారు. ఐటీడీఏ పరిధిలో ఈనెల 5న నిర్వహించనున్న యోగాంధ్రను విజయవంతం చేయాలన్నారు. ఉపాధి, వెలుగు, ఐసీడీఎస్, హార్టికల్చర్, ట్రాన్స్‌కో, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. సచివాలయ సిబ్బంది కూడా పాల్గొనాలని ఆదేశించారు. పెద్ద ఎత్తున జనాలు తరలిరావాలన్నారు. ఇదిలా ఉండగా సోమవారం నిర్వహించిన యోగ కార్యక్రమానికి అధికారులతో పాటు వారి సిబ్బంది పూర్తిస్థాయిలో హాజరుకాకపోవడంపై పీవో అసహనం వ్యక్తం చేశారు. యోగాకు రాని సచివాలయ సిబ్బందికి మెమోలు జారీ చేయాలని ఎంపీడీవో మిశ్రోను ఆదేశించారు.