ఫిర్యాదులను పరిష్కరించాలి: ఎస్పీ
ABN , Publish Date - Aug 05 , 2025 | 12:42 AM
ఫిర్యా దులను సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు. సోమవారం పోలీస్ జిల్లా కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. పీజిఆర్‌ఎస్‌లో 13 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు.
బెలగాం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : ఫిర్యా దులను సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు. సోమవారం పోలీస్ జిల్లా కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. పీజిఆర్‌ఎస్‌లో 13 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వ్యయప్రయాసలతో వచ్చిన ఫిర్యాదు దారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాధితులు ఇచ్చిన వినతిపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరతగతిన దర్యాప్తు చేపట్టి బాధితులకు తగిన న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్‌బి సీఐ సుధాకర్, ఎస్‌ఐ ప్రకృద్ధీన్, సిబ్బంది పాల్గొన్నారు.