ss
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:18 AM
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు.

బెలగాం, మార్చి 10 (ఆంధ్ర జ్యోతి): ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు. సోమవారం పార్వతీ పురంలోని జిల్లా పోలీస్ కార్యాల యంలో ఎస్పీఆధ్వర్యంలో నిర్వ హించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమం 14 ఫిర్యాదులు అందాయి. జిల్లా న లుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులతో ఎస్పీ మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్వరగతిన దర్యాప్తు చేపట్టి బాధితులకు తగిన న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్ర మంలో డీసీఆర్‌బీ ఎస్సై ప్రకృద్దీన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.