సకాలంలో ఫిర్యాదులు పరిష్కరించాలి
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:53 PM
అర్జీదారులు నుంచి వస్తున్న ఫిర్యాదులు సకాలంలోని పరిష్కరించాలని కలెక్టర్ రామ సుందర్ రెడ్డి ఆదేశించారు.
విజయనగరం, కలెక్టరేట్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): అర్జీదారులు నుంచి వస్తున్న ఫిర్యాదులు సకాలంలోని పరిష్కరించాలని కలెక్టర్ రామ సుందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వ హించిన పీజీఆర్‌ఎస్‌లో అర్జీదారులు నుంచి వివిధ సమస్యలపై 375 వినతులు స్వీకరించారు. ప్రజలు విజ్ఞప్తులను స్వయంగా పరిశీలించిన కలెక్టరు రామసుందర్‌రెడ్డి ప్రతి దరఖాస్తుపై తక్షణ చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. పూసపాటిరేగ మండలంలోని చింతపల్లికి చెందిన తొమ్మిది మంది జాలర్లు పొరపాట్లు బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించి కోస్ట్ గార్డ్ కస్టడీలోఉన్న నేపధ్యంలో వారి కుటుంబసభ్యులు మత్య్సకార సహ కార సంఘం అధ్యక్షులు బర్రి అప్పన్న ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అంజేశారు. కాగా రైతులకు మద్దతు ధరపై అవగాహన కల్పించే పోస్టర్‌ను మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో కలెక్టరు రాంసుందర్ రెడ్డి ఆవిష్కరించారు. పదేళ్లుగా బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు క్లెయిమ్స్ చేసుకోవడానికి వీలుగా ఆర్బీఐ విడుదల చేసిన మార్గదర్శకాల వాల్‌పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు.
ఫదత్తికి చెందిన పి.ధనంజయనాయుడుకు వైద్యులతో సమన్వయం చేసుకుని చికిత్స అందించాలని కలెక్టరు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఇటీ వల దత్తి గ్రామం సందర్శనలో బంగారు కుటుంబానికి చెందిన పి.ధనం జయనాయుడుకు రూ.ఐదు లక్షల సాయం మంజూరుచేసి, ఆయన చికిత్సకు అవసరమైనఏర్పాట్లుచేయాలని ఆదేశించిన విషయం విదితమే. ఈ మేరకు అప్పటికప్పడు కలెక్టరు ఐదులక్షలు అందజేశారు. కాగా ధనంజయనాయుడు పీజీఆర్‌ఎస్‌లో కలెక్టరును కలవగా, కలెక్టరు వెం టనే డీఎంహెచ్‌కు రిఫర్‌చేశారు. వైద్యులు ఆయనకు ఆప్టిక్ న్యూరైటిస్ వ్యాధి ఉందని నిర్ధారించి, విశాఖ ప్రాంతీయ కంటి ఆసుపత్రికి రిపర్ చేశారు.కార్యక్రమంలోని జేసీ సేతు మాధవన్, డీఆర్‌వో శ్రీనివాస్ మూర్తి, ఉప కలెక్టర్లు వెంకటేశ్వరరావు, మురళి, రాజేశ్వరి, ప్రమిల గాంధీ, శాంతి, కళావతి ఉన్నారు.
ప్రత్యేకాధికారులు సచివాలయాలను సందర్శించాలి
పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీలు గడువులోపల పరిష్కరించాలని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి కోరారు. సోమవారం పీజీఆర్‌ఎస్ అర్జీల ఆడిట్‌పై సమీక్షించారు. ప్రీఆడిట్‌లో ప్రవర్తనాపరమైన లోపాలు, పద్ధతిని అనుస రించేవిధానంపై కలెక్టరేట్ కాల్‌సెంటర్ నుంచి ఆడిట్ టీమ్ అర్జీదా రులతో మాట్లాడి పోన్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుందని, వారి చెప్పిన విషయాల్ని వాస్తవంగా నమోదు చేయాలని తెలిపారు. అసం తృప్తి శాతం ఎక్కువగాఉన్న తహసీల్దార్లు వద్ద ఉన్న అర్జీలను మండల ప్రత్యేకాఽధికారులు సమీక్షించారు. మండల ప్రత్యేకాధికారులు వారంలో నాలుగు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారు.
మెంటాడను విజయనగరంలో కొనసాగించాలి
మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలో కొనసాగించాలని మెంటాడ మండలానికి చెందిన వివిధ ప్రజాసంఘాల, వైసీపీ, జనసేన నాయకులు కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో తమ సమస్యను కలె క్టరుకు వివరించారు. ఈకార్యక్రమంలోని మెంటాడ ఎంపీపీ రెడ్డి సన్యా సినాయుడు, వైసీపీ నాయకులు రామారావు, జేఏసీ నాయకులు పైడిపు నాయుడు పాల్గొన్నారు. అలాగే ఉపాధి హామీ పఽథకం ద్వారా చేపట్టను న్న పనులు రైతులకు ఉపయోగ పడే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు సంఘ నాయకులు బి.రాంబాబు కోరారు.ఈ మేరకు కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేశారు. కాగా విజయన గరంలోని సుంకరివీఽధిలో ఉన్న నీరుపారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజ నీరింగ్ కార్యాలయం భవనం శిథిలా వ్యవస్థకు చేరడంతో మరో చోటికి తరలించాలని ఉత్తరాంధ్ర అంబేడ్కర్ రైట్స్ నాయకులు వినతి పత్రం అందజేశారు.