ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం: ఆర్డీవో
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:53 PM
మండలంలోని తారాపురంలో ఎన్‌హెచ్-26 విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారికి నష్టాన్ని బట్టి ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని ఆర్డీవో రామ్మోహనరావు తెలిపారు. తారాపు రంలో ఇళ్లుకోల్పోతున్న వారు ఎంత మేరకు నష్టపోతున్నారు
రామభద్రపురం, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని తారాపురంలో ఎన్‌హెచ్-26 విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారికి నష్టాన్ని బట్టి ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని ఆర్డీవో రామ్మోహనరావు తెలిపారు. తారాపు రంలో ఇళ్లుకోల్పోతున్న వారు ఎంత మేరకు నష్టపోతున్నారు అన్న విషయంపై ఎన్‌హెచ్ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విస్తరణలో ఎక్కువగా తొలగించకుండా ఎక్కువగా నష్టం జరగ కుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. రహదా రి విస్తరణకు సహకరించాలని, ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందుతుందని తెలిపారు. జీవో నెంబరు 23 ప్రకారం ఇంటి స్థలాకు దరఖాస్తు చేసుకుంటే అర్హులకు ప్రభుత్వంస్థలం మంజూరు చే స్తుందని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సులోచనరాణి పాల్గొన్నారు.