Share News

బాల్యవివాహాల నివారణకు కమిటీలు

ABN , Publish Date - May 06 , 2025 | 11:50 PM

బాల్యవివాహాలు నివారించేందుకు గ్రామ స్థాయిలో 11 మందితో కమిటీలు వేశామని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ షేక్‌ రుక్సానా సుల్తాన్‌ బేగం తెలిపారు.

బాల్యవివాహాల నివారణకు కమిటీలు
పౌష్టికాహార కిట్లు పంపిణీ చేస్తున్న పీడీ షేక్‌ రుక్సానా సుల్తాన్‌ బేగం

  • గ్రామస్థాయిలో 11మందితో నియామకం

  • ఐసీడీఎస్‌ పీడీ షేక్‌ రుక్సానా సుల్తాన్‌ బేగం

రామభద్రపురం, మే 6(ఆంధ్రజ్యోతి): బాల్యవివాహాలు నివారించేందుకు గ్రామ స్థాయిలో 11 మందితో కమిటీలు వేశామని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ షేక్‌ రుక్సానా సుల్తాన్‌ బేగం తెలిపారు. మండల పరిధిలోని బూసాయవలస అంగన్‌వాడీ కేంద్రంలో కిశోర్‌ బాలికలతో ఆమె మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బేటీ పడావో, బేటీ బచావో కార్యక్రమంలో భాగంగా జీవో నెం బరు 39 ప్రకారం బాల్య వివాహాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సర్పం చ్‌ చైర్‌పర్సన్‌గా 11 మంది సభ్యులను నియ మించి ఒకటి, మూడో శుక్రవారాల్లో సమా వేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తు న్నట్లు చెప్పారు. 2024-25 సంవత్స రంలో 25 మంది బాల్య వివాహా లు నిరోధించామని, వీరిలో కొంత మందిపై కేసులు కూడా నమోదు చేశామని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు, గర్భిణులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. కిశోర బాలికలకు శారీరక దృఢత్వం, పౌష్టికాహారం, వేధింపులపై సూచనలు, సలహాలు అందిస్తు న్నామని చెప్పారు. జిల్లాలో 12 అంగన్‌వాడీ టీచర్లు, 67 హెల్పర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అంగన్‌వాడీ సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. అనంతరం గర్భిణులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ బి.లక్ష్మి, బాడంగి సీడీపీవో రాజ్యలక్ష్మి, సూపర్‌వైజర్లు కృష్ణకుమారి, సూర్యకుమారి పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:50 PM