Share News

Anna Canteens అన్నా క్యాంటీన్లకు కమిటీలు

ABN , Publish Date - Nov 29 , 2025 | 11:53 PM

Committees for Anna Canteens పేదల ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్ల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా కూటమి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే ప్రతి అన్నా క్యాంటీన్‌ పరిధిలో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

  Anna Canteens అన్నా క్యాంటీన్లకు కమిటీలు
పాలకొండలో అన్నాక్యాంటీన్‌

  • ఆహారం నాణ్యత, పరిశుభ్రతకు పెద్దపీట

  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

పాలకొండ, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): పేదల ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్ల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా కూటమి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే ప్రతి అన్నా క్యాంటీన్‌ పరిధిలో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో చైర్మన్‌గా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లేదా కౌన్సిలర్‌ ఉంటారు. ఇక సభ్యులుగా శానిటేషన్‌, ఎన్విరాన్‌మెంట్‌, వార్డు ఉమెన్‌ వీకర్స్‌ సెక్షన్‌ సెక్రటరీలు, ఎన్‌జీవో, ఎస్‌హెచ్‌జీ ప్రతినిఽధులు ఉంటారు. సంబంధిత అన్నా క్యాంటీన్‌ నోడల్‌ ఆఫీసర్‌ కన్వీనర్‌గా ఉంటారు. జిల్లాలో పాలకొండ, పార్వతీపురం అన్నాక్యాంటీన్లు ఉన్నాయి. వాటి ద్వారా రోజూ వేలాది మంది నిరుపేదలకు రుచికరమైన భోజనం అందిస్తున్నారు. సాలూరు, కురుపాం, సీతంపేటకు అన్నా క్యాంటీన్లు మంజూరు చేశారు. వాటి భవనాల నిర్మాణం జరుగుతుంది. ఇవి కూడా మరికొద్ది నెలల్లో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

కమిటీల బాధ్యత...

అన్నా క్యాంటీన్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రతను కమిటీలు పర్యవేక్షించాల్సి ఉంది. డైలీ ఫుడ్‌ టేస్ట్‌ నమోదు, సరుకుల నాణ్యత చూడాలి. క్యాంటీన్‌ నిర్వహణపై రోజువారీ, వారాంతాపు రికార్డులు సిద్ధం చేయాలి. సీసీటీవీ, ఎఫ్‌ఆర్‌ఎస్‌, వంటి వాటిని పరిశీలిస్తారు. లబ్ధిదారులు నుంచి ఫీడ్‌బ్యాక్‌ సేకరిస్తారు. సేవల్లో లోపాలు ఉంటే వెంటనే పరిష్కారిస్తారు. కమ్యూనిటీ భాగ స్వామ్యం, వలంటీర్లు సమన్వయం ప్రభుత్వ ఆమోదిత వారపు మెనూ అమలును సైతం పరిశీలి స్తారు. అన్నా క్యాంటీన్లు మరింత పారదర్శకంగా పనిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Updated Date - Nov 29 , 2025 | 11:53 PM