తండ్రిని చూసేందుకు వస్తూ...
ABN , Publish Date - Aug 30 , 2025 | 12:10 AM
అనారోగ్యంతో బాధ పడుతున్న తన తండ్రిని చూసేందుకు విశాఖ నుంచి రాజాం వస్తూ మార్గమధ్యలో ఆటో బోల్తా పడిన సంఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు.
ప్రమాదంలో గాయపడిన కుమారుడి మృతి
రాజాం రూరల్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో బాధ పడుతున్న తన తండ్రిని చూసేందుకు విశాఖ నుంచి రాజాం వస్తూ మార్గమధ్యలో ఆటో బోల్తా పడిన సంఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. రాజాం టౌన్ సి.ఐ. కె.అశోక్‌కుమార్ అందజేసిన వివరాల ప్రకారం.... రాజాంకు చెందిన యండమూరి శ్రీనివాసరావు (40) భార్య, పిల్లలతో కలిసి విశాఖ జిల్లా గాజువాకలో ఉంటున్నారు. తన తండ్రి మాధవరావు ఆరోగ్యం బాగాలేదని తెలిసి ఈనెల 25న గాజువాక నుంచి రాజాం వస్తూ మండల పరిధిలోని బొద్దాం వద్ద ఆటో బోల్తా పడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. రాజాం సామాజిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి.. మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 28న రాత్రి శ్రీనివాసరావు మృతి చెందాడు. మృతుడి భార్య యండమూరి రోజా ఫిర్యాదు మేరకు పొలీసులు కేసు నమోదు చేశారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసరావు సోదరుడు కూడా మృతి చెందాడు. ఇద్దరు కుమారులూ దూరమవడంతో మాధవరావు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.