వినాయక చవితికి స్వగ్రామం వచ్చి..
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:22 AM
మండలంలోని చినమ్మతల్లి ఆలయం సమీపంలో జాతీయరహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాద ంలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు.
రామభద్రపురం, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని చినమ్మతల్లి ఆలయం సమీపంలో జాతీయరహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాద ంలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఎస్‌ఐ వెలమల ప్రసాద్ కథనం మేరకు.. బొబ్బిలి మండలం పారాదికి చెందిన పువ్వల బాలాజీ (23)బైకుపై రామభద్రపురం వైపు వస్తున్నాడు. విజయనగరం నుంచి పార్వతీ పురం వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బాలాజీ విశాఖ జిల్లాలోని తగరపువలస దివీస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బాలాజీ కి తండ్రి వెంకటరమణ, తల్లి లక్ష్మి ఉన్నారు. తమను వృద్ధాప్యంలో ఆదుకుంటా డనుకున్న కుమారుడు మృతితో తల్లిదండ్రుల రోదిస్తున్నారు. వినాయక చవితికి స్వగ్రామానికి వ చ్చి మృతిచెందడంతో గ్రామస్థులు విషాధంలో మునిగిపోయా రు. తండ్రి వెంకటరమణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృత దేహానికి గురువారం బాడంగి సీహెచ్‌సీలో పోస్టుమార్టం నిర్వహించారు.