Share News

Come to the meeting with complete details సమావేశానికి సమగ్ర వివరాలతో రావాలి

ABN , Publish Date - Dec 02 , 2025 | 11:56 PM

Come to the meeting with complete details ఈ నెల 4న జరగనున్న జిల్లా సమీక్ష సమావేశానికి అధికారులంతా సమగ్ర వివరాలతో హాజరుకావాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు. ఆ సమావేశాన్ని సమర్థంగా నిర్వహించేందుకు జేసీ సేతుమాధవన్‌తో కలిసి మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ముందస్తు సమావేశం నిర్వహించారు.

Come to the meeting with complete details సమావేశానికి సమగ్ర వివరాలతో రావాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

సమావేశానికి సమగ్ర వివరాలతో రావాలి

కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

విజయనగరం కలెక్టరేట్‌, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఈ నెల 4న జరగనున్న జిల్లా సమీక్ష సమావేశానికి అధికారులంతా సమగ్ర వివరాలతో హాజరుకావాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు. ఆ సమావేశాన్ని సమర్థంగా నిర్వహించేందుకు జేసీ సేతుమాధవన్‌తో కలిసి మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ముందస్తు సమావేశం నిర్వహించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని సూచించారు. వ్యవసాయం, నీటి పారుదల ప్రాజెక్టులు, గృహ నిర్మాణం పురోగతి, పారిశుధ్యం, వైద్యారోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన వేగవంతంపై దృష్టిసారించాలని చెప్పారు. ఖరీఫ్‌, రబీ సీజన్లలో పంటల ప్రణాళిక, నీటి పారుదల ప్రాజెక్టుల స్థితిగతులు, ధాన్యం సేకరణ, విద్య, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఆరోగ్య సేవలపై పూర్తి వివరాలు సమర్పించాలని చెప్పారు. జేసీ సేదుమాధవన్‌ మాట్లాడుతూ జిల్లా సమీక్షా సమావేశంలో నివేదికలు కేవలం సంఖ్యాపరంగా కాకుండా పథకాల అమలులో క్షేత్రస్థాయి ప్రభావం ఎలా ఉందో తెలియజేయాలని సూచించారు. సమావేశంలో సీపీవో బాలాజీ, జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు.

భూసేకరణ వేగంగా పూర్తి చేయాలి

జిల్లాలో పలు జాతీయ ప్రాజెక్టులకు చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు. భూసేకరణపై తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారి 130(సిడి) , జాతీయ రహదారి 516 (బి), రైల్వే ఆర్‌వోబీలు, జి.సిగడాం నాలుగో రైల్వేలైన్‌ తదితర ప్రాజెక్టులపై సమీక్షించారు. సమావేశంలో జేసీ సేతు మాధవన్‌, ఆర్‌డీవోలు కీర్తి, సత్యవాణి, రామ్మోహన్‌, కలెక్టరేట్‌ ఈ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ తాడ్డి గోవింద తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 11:56 PM