Share News

Vinayaka వెళ్లిరా.. వినాయకా

ABN , Publish Date - Sep 07 , 2025 | 12:08 AM

Come Forth, Lord Vinayaka ఉమ్మడి జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఆదివారం చంద్రగ్రహణం కారణంగా శనివారం పెద్దఎత్తున నిమజ్జనోత్సవాలు నిర్వహించారు. ముందుగా వినాయక విగ్రహాలను మేళతాళాలతో ఊరేగించి.. చెరువులు, నదుల్లో అనుపోత్సం చేశారు.

  Vinayaka   వెళ్లిరా.. వినాయకా
సాలూరులో ఊరేగింపుగా వెళ్తున్న దృశ్యం

  • మేళతాళాలతో ఊరేగింపు..

  • ఉత్సాహంగా పాల్గొన్న యువత

  • ముగిసిన నవరాత్రి ఉత్సవాలు

ఉమ్మడి జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఆదివారం చంద్రగ్రహణం కారణంగా శనివారం పెద్దఎత్తున నిమజ్జనోత్సవాలు నిర్వహించారు. ముందుగా వినాయక విగ్రహాలను మేళతాళాలతో ఊరేగించి.. చెరువులు, నదుల్లో అనుపోత్సం చేశారు. ఈ సందర్భంగా యువత డ్యాన్సులతో సందడి చేశారు. మరోవైపు బళ్ల వేషాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాలతో పాటు 15 మండలాల్లోనూ గణేశ విగ్రహ నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.

(పార్వతీపురం-ఆంధ్రజ్యోతి)

Updated Date - Sep 07 , 2025 | 12:08 AM