Share News

బిర్యానీ కోసం వచ్చి..

ABN , Publish Date - Sep 10 , 2025 | 11:52 PM

మం డలంలోని కిల్తంపాలెం పంచాయతీ పరిధిలోగల చీడి పాలెం వద్ద ద్విచక్రవాహనం బోల్తాపడడంతో ఓ యువ కుడు మృతిచెందాడు.

బిర్యానీ  కోసం వచ్చి..
శ్రీనివాసరావు (ఫైల్‌) :

ఎస్‌.కోట రూరల్‌, సెప్టెంబరు10 (ఆంధ్రజ్యోతి): మం డలంలోని కిల్తంపాలెం పంచాయతీ పరిధిలోగల చీడి పాలెం వద్ద ద్విచక్రవాహనం బోల్తాపడడంతో ఓ యువ కుడు మృతిచెందాడు. సీఐ నారాయణమూర్తి కథనం మేరకు.. గంట్యాడ మండలంలోని తాటిపూడికి చెందిన కొయ్యి శ్రీనివాసరావు(24) ఆలియస్‌ (పండు) మంగళ వారం రాత్రి తన స్నేహితులతో మండలంలోని బొడ్డవర బిర్యానీ కోసం వచ్చాడు. తన స్నేహితులతో హోటల్‌లో గడిపితిరిగి తాటిపూడి పయణమయ్యాడు. ఈక్రమంలో చీడిపాలెం జంక్షన్‌ వద్ద ఎదురుగా గొర్రెల మంద రావ డంతో వేగానికి నియంత్రించుకోలేకపోవడంతో ద్విచక్రవాహనం బోల్తాపడ డంతో శ్రీనివాసరావు కిందపడిపోయాడు. తలకు బలమైన గాయంకావడంతో ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విజయ నగరం మహారాజ ఆసుపత్రికి రిఫర్‌చేశారు. ఆసుపత్రికి తరలిస్తున్న సమ యంలో మార్గమధ్యలో మృతిచెందాడు. శ్రీనివాసరావు తండ్రి సన్యాసిరావు ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేశారు.

్జ్జకుక్క అడ్డురావడంతో ఆటో బోల్తాపడి మరొకరు..

గుర్ల, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద బంటుపల్లి-రేగటి గ్రామాల మధ్యలో బుధవారం మధ్యా హ్నం ఆటోబోల్తాపడడంతో ఓవ్యక్తి దుర్మరణం పాలయ్యా డు.ఎస్‌ఐ నారాయణరావు కథనం మేరకు.. గరివిడి నుంచి వెళ్తున్న ఆటో ఆ గ్రామసమీపంలోగల మలుపు వద్ద కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో స్థాని కులు ఆటోను పైకిఎత్తారు. దాని కిందపడి సింగవరం గ్రామానికి చెందిన తవిటినాయుడు మృతిచెందినట్లు గుర్తించారు. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసు లు సంఘటనా స్థలానికి చేరుకొని తవిటినాయుడు మృతదేహాన్ని చీపురు పల్లి ఆసుపత్రికి తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేశారు.

Updated Date - Sep 10 , 2025 | 11:52 PM