Share News

ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌

ABN , Publish Date - Nov 24 , 2025 | 11:38 PM

సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధికారులకు వినతిపత్రాలు అందజేసిన ఆయా సంఘాల నాయకులు తమ సమస్యలు పరిష్కరించాలని వివిధ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ దద్దరిల్లింది. అనంతరం జిల్లా అధికారులకు ఆయా సంఘాల నాయకులు వినతిపత్రాలు అందజేశారు.

ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌
కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలియజేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు :

సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధికారులకు వినతిపత్రాలు అందజేసిన ఆయా సంఘాల నాయకులు

తమ సమస్యలు పరిష్కరించాలని వివిధ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ దద్దరిల్లింది. అనంతరం జిల్లా అధికారులకు ఆయా సంఘాల నాయకులు వినతిపత్రాలు అందజేశారు.

ఇళ్ల పట్టాలు ఇవ్వాలి

విజయనగరం టౌన్‌, నవంబరు24 (ఆంధ్రజ్యోతి):నగరంలో నివాసం ఉన్నచోటే పేదలకు ఇళ్లపట్టాలను ఇవ్వాలని, దీనికి సంభందించి ఇప్పటికే ప్రభుత్వం జీవో జారీచేసి ఏడాది పూర్తయినా పట్టాలు మంజూరులో అల సత్వం చూపుతున్నారని సీపీఎంజిల్లా కార్యరర్శి రెడ్డిశంకరరావు ఆరోపించా రు. కలెక్టర్‌ వద్ద నిర్వాసితులతో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలోని జొన్నగుడ్డి, ఎల్‌బిజీనగర్‌, గురజాడనగర్‌, పూల్‌ బాగ్‌, గంజిపేట, గొడగల వీధి,సేఏ్టడియం కాలనీ, నల్లచెరువు, దాసన్న పేట, ఎర్రచెరువులో దశాబ్దాలుగా పేదలు నివాసముంటున్నా వారికి ఇప్ప టికీ పట్టాలు ఇవ్వలేదని తెలిపారు.

హెచ్‌ఆర్‌పాలసీ అమలుచేయాలి

ఏపీ సమగ్రశిక్ష ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న ఒప్పంద, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌పాలసీ, ఎంటీఎస్‌ను అమలుచేయాలని సమగ్రశిక్ష ఉద్యోగులు కోరారు. ఈమేరకు విజయనగరంలోని కలెక్టరేట్‌ వద్ద అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా జేఏసీ అధ్యక్షుడు కాంతారావు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత లేకుండా తక్కువ వేతనాలతో ఉద్యోగులుఇబ్బందిపడుతన్నారని, ప్రభుత్వం ఏర్పాటై 18 నెలలుపూర్తయినా హామీలను నెరవేర్చిలేదని తెలిపారు.సమగ్రశ్రిక్ష ఉద్యోగు లకు సర్వీస్‌ వెయిటేజ్‌ను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగు లను రెగ్యులైజ్‌చేయాలని, వేతనాలు పెంచడమే కాకుండా సకాలంలో చెల్లించాలని జేసీ సేతుమాధవన్‌కు వినతిపత్రం అందజేశారు.

మైక్రోఫైౖనాన్స్‌ ఆగడాలపై చర్యలు చేపట్టాలి

మైక్రోఫైౖనాన్స్‌ ఆగడాలపై చర్యలు చేపట్టాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పుణ్యవతి కోరారు. కలెక్టరేట్‌ వద్ద బాధిత మహిళలతో నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోనివడ్డీవ్యాపారులపై దర్యాప్తు చేసి అధిక వడ్డీలు వసూళ్లు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఐద్వా కార్యదర్శి పాలూరు రమణమ్మ పాల్గొన్నారు.

రిజర్వేషన్‌ లేక..

జిల్లాలోని యాత కులస్థులపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని కల్లుగీత కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు పురం అప్పారావు ఆరోపించారు. కలెక్టరేట్‌ వద్ద గీత కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యాత కులం అన్నిరంగాలలో వెనుకబడి ఉందని, ప్రత్యేక రిజర్వేషన్‌ లేక తమ ప్లిలకు తగిన అవకాశాలు అందలేకపోతు న్నారని తెలిపారు. కార్యక్రమంలో కె.కోటారావు, రామారావు, పి.సత్యం, ఫణి, రామారావు పాల్గొన్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి

ఉద్యోగభద్రత కల్పించాలని, కనీసవేతనం రూ.26 వేలుఇవ్వాలని క్షేత్ర సహాయకులు కోరారు.విజయనగరంలోని మహారాజా ఆసుపత్రి నుంచి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు.ఈసందర్భంగా సంఘ అధ్యక్షుడు భోగాపురపు రాజారావు మాట్లాడుతూ క్షేత్రసహాయకులను బదిలీలు చేపట్టాలని కోరారు. టార్గెట్‌ విధానం రద్దుచేయాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జేసీ సేతు మాదవన్‌కు అందజేశారు. ఈ కార్య క్రమంలో జిల్లాలోని 557 మంది క్షేత్రసహాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2025 | 11:38 PM