Share News

Collector Angered హాస్టల్‌ అపరిశుభ్రతపై కలెక్టర్‌ ఆగ్రహం

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:32 AM

Collector Angered Over Hostel Uncleanliness పాచిపెంట మండలం పి.కోనవలసలోని గిరిజన సంక్షేమ బాలుర వసతిగృహం అపరిశుభ్రతపై కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి వసతిగృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదిలో పరిస్థితిని చూసి ప్రిన్సిపాల్‌పై మండిపడ్డారు.

Collector Angered  హాస్టల్‌ అపరిశుభ్రతపై కలెక్టర్‌ ఆగ్రహం
ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కలెక్టర్‌

పార్వతీపురం, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): పాచిపెంట మండలం పి.కోనవలసలోని గిరిజన సంక్షేమ బాలుర వసతిగృహం అపరిశుభ్రతపై కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి వసతిగృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదిలో పరిస్థితిని చూసి ప్రిన్సిపాల్‌పై మండిపడ్డారు. విద్యార్థులు నివసించే ప్రాంతాలు, వంటశాల, మరుగుదొడ్లు, హాస్టల్‌ పరిసరాలు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు. ఇకపై ఇటువంటి వాతావరణం కనిపిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ వైశాలి తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 12:32 AM