Share News

కుప్పకూలిన వైటీసీ భవనం

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:26 AM

సాలూరు మండలం జీగిరాంలో ఉన్న వైటీసీ (యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌) భవనం సోమవారం ఒక్కసారిగా కూలిపోయింది.

కుప్పకూలిన వైటీసీ భవనం
జీగిరాంలో కూలిన వైటీసీ భవనం శిథిలాలు

  • ఖాళీగా ఉండడంతో తప్పిన ప్రమాదం

సాలూరు రూరల్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): సాలూరు మండలం జీగిరాంలో ఉన్న వైటీసీ (యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌) భవనం సోమవారం ఒక్కసారిగా కూలిపోయింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ భవనం బాగా నానిపోయి ఉంది. దీంతో సోమవారం కురిసిన వర్షాలకు కూలిపోయింది. ఈ భవనం ప్రస్తుతం ఖాళీగా ఉంది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సాలూరు నియోజకవర్గ గిరిజనులకు వృత్తి విద్యలో శిక్షణకు ఈ భవనాన్ని వినియోగించేవారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈ భవనం రెండున్నర దశాబ్దాల కిందట నిర్మించారు. ఐటీడీఏ, వెలుగు ఆధ్వర్యంలో టైలరింగ్‌, రాడ్‌ బెండింగ్‌, వెల్డింగ్‌ తదితర వృత్తి విద్యలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేవారు. కొన్ని సంవత్సరాలుగా ఇది నిరుపయోగంగా ఉంది. ఈ భవనంలో ఎటువంటి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం లేదు. గుమడాంలో వైటీసీ నిర్మాణంతో అక్కడే శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీని వల్ల భవనం కూలిపోయినా..ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. దీంతో పరిసరాల్లోని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Jul 08 , 2025 | 12:26 AM