CM Visiting 5న జిల్లాకు సీఎం?
ABN , Publish Date - Nov 28 , 2025 | 11:20 PM
CM Visiting the District on the 5th? ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లేదా విద్యాశాఖ మంత్రి లోకేశ్ వచ్చేనెల 5న జిల్లాలో పర్యటించనున్నారు. భామినిలో నిర్వహించనున్న మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ (పీటీఎం) మీటింగ్‌కు వారు హాజరుకానున్నట్లు తెలిసింది. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
భామినిలో మెగా పీటీఎంకు హాజరు
ఏర్పాట్లలో అధికారులు
పార్వతీపురం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లేదా విద్యాశాఖ మంత్రి లోకేశ్ వచ్చేనెల 5న జిల్లాలో పర్యటించనున్నారు. భామినిలో నిర్వహించనున్న మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ (పీటీఎం) మీటింగ్‌కు వారు హాజరుకానున్నట్లు తెలిసింది. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగా శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ కమి షనర్ విజయరామరాజు భామినిలో ఆదర్శ పాఠశాలను సందర్శించారు. సంబంధిత అధికారులు, సిబ్బందికి పలు సూచ నలు చేశారు. మంత్రి నారా లోకేశ్ పర్యటన దాదాపు ఖరారవగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమావేశానికి హాజరవుతారా ? లేదా! అనేది మరో రెండు రోజుల్లో స్పష్టం కానుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
శ్రేణులతో ప్రత్యేక సమావేశం
పాలకొండ నియోజకవర్గంపై టీడీపీ అధిష్థానం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించినట్లు సమా చారం. ఈ మేరకు వచ్చే నెల 5న మంత్రి నారా లోకేశ్ భామిని మండలంలో పర్యటించిన అనంతరం పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. ఎవరు అవునన్నా.. కాదన్నా..పాలకొండ నియోజకవర్గంలోని టీడీపీలో రెండు బలమైన గ్రూప్‌లు ఉన్నాయి. ఇద్దరు బలమైన నాయకులు తెరవెనుక ఉంది ఆ గ్రూపులకు నాయకత్వం వహి స్తున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన తర్వాత టీడీపీలో చాలామంది నాయ కులు, కార్యకర్తలు ఆయనతో నడవడం ప్రారంభించారు. మరికొంతమంది శ్రేణులు పార్టీ నియో జకవర్గ ఇన్‌చార్జిగా పడాల భూదేవి వెంట ఉన్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవు తున్న దృష్ట్యా మంత్రి లోకేశ్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. రెండు గ్రూపుల నాయకులు, కార్యకర్తలను ఒకేతాటిపైకి తెచ్చి.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం.