CM 5న జిల్లాకు సీఎం రాక
ABN , Publish Date - Dec 01 , 2025 | 11:32 PM
CM to Visit the District on the 5th ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 5న జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు భామిని ఏపీ మోడల్ స్కూల్‌కు చేరుకుంటారు.
షెడ్యూల్ ఖరారు
పార్వతీపురం, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 5న జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు భామిని ఏపీ మోడల్ స్కూల్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు మోడల్ స్కూల్‌లోని మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో పాల్గొంటారు. 2.10 గంటలకు భామిని నుంచి తిరుగు ప్రయాణమవుతారు. నాలుగు గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏర్పాట్లు పరిశీలన
భామిని: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన నేపథ్యంలో భామిని మెడల్ స్కూల్ ఆవరణలో వేదిక ఏర్పాటు చేసేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు సోమవారం ఆ ప్రదేశాన్ని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి, జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పరిశీలించారు. మోడల్ స్కూల్ సమీపంలో ఉన్న స్థలం, లివిరి జంక్షన్ వద్ద ప్రాంతాన్ని కూడా సందర్శించారు. వేదిక ఏర్పాటుకు అవసరమైన సలహా, సూచనలు ఇచ్చారు. లివిరి జంక్షన్ వద్ద హెలీప్యాడ్ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. మరోవైపు సీఎంవో కార్యాలయం నుంచి వచ్చిన అధికారులు, సిబ్బంది మోడల్ స్కూల్ పరిసరాలను పరిశీలించారు. ఏర్పాట్లను సమగ్ర శిక్ష కమిషనర్ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఈ పరిశీలనలో పాలకొండ డీఎస్పీ రాంబాబు, సీఐ ప్రసాద్, తహసీల్దార్ శివన్నారాయణ, ఎస్‌ఐ అప్పారావు తదితరులు ఉన్నారు.