సీఎం సహాయ నిధి అందజేత
ABN , Publish Date - Mar 10 , 2025 | 12:10 AM
గుమ్మలక్ష్మీ పురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ఆదివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందించారు.
గుమ్మలక్ష్మీపురం, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): గుమ్మలక్ష్మీ పురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ఆదివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందించారు. జియమ్మవలస మండలం కన్నపుదొరవలస గ్రామానికి చెందిన ఈగల సత్యనారా యణ అనారోగ్యానికి గురి కావడంతో ఎమ్మెల్యే చొరవతో సీఎం సహాయ నిధి నుంచి రూ.63,727 మంజూర య్యింది. ఈ చెక్కును ఆమె సత్యనారాయణ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.