కొండ ఎక్కి.. ఆటోలో వెళ్లి
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:10 AM
రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకరరావు బుధవారం సాలూరు మండలం మారయ్యపాడు, తాడిలోవ, పాలికవలస, పెదపథంలో పర్యటించారు.

గిరిజన గ్రామాల్లో ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటన
సాలూరు రూరల్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకరరావు బుధవారం సాలూరు మండలం మారయ్యపాడు, తాడిలోవ, పాలికవలస, పెదపథంలో పర్యటించారు. మారయ్యపాడు గిరిశిఖరాన ఉండడంతో పాటు రహదారి బాగులేదు. దీంతో ఆయన కొంత దూరం కొండపైకి నడిచారు. స్థానికులు కొంత దూరంలో ఆటో ఏర్పాటు చేయడంతో దానిలో ఆయన గ్రామానికి చేరుకు న్నారు. పెద మారయ్యపాడులో తాగు నీరు, అటవీ భూహక్కుల పట్టాలు, పా ఠశాల భవనం కావాలని తదితర సమ స్యలను గిరిజనులు ఆయనకు వివరిం చారు. చిన మారయ్యపాడు గిరిజనులు మినీ అంగన్‌వాడీ కేంద్రం కావాలని కోరారు. ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాల సమస్యను వివరించారు. తాడిలోవ, పాలికవలస, పెదపథం గిరిజనులు కూడా ఆర్వోఎఫ్ ఆర్ పట్టాల సమస్యను వివరించారు. విద్యుత్ స్తంభాల ఏ ర్పాటుపై విన్నవించారు. ఆర్వోఎఫ్‌ఆర్‌పై తహసీల్దార్ రమణ ను ఆయన ప్రశ్నించగా 1150 పట్టాలు పెండింగ్‌లో ఉన్నా యని ఆయన చెప్పారు. ఆర్వోఎఫ్‌ఆర్ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. గిరిజనుల సమస్యలను కమి షన్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరానికి కృషి చే స్తుందని శంకరరావు తెలిపారు. ఆయనతో సాలూరు తహ సీల్దార్ ఎన్వీ రమణ, ఎంపీడీవో గొల్లపల్లి పార్వతి, ఎస్‌ఐ న ర్సింహమూర్తి, సాలూరు వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, మత్స విజయభాస్కర్, దండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.