Cleanliness పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:31 AM
Cleanliness of the Surroundings is Everyone’s Responsibility పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సోమవారం స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛాంధ్ర జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 48 మందికి అవార్డులు అందించారు.
పార్వతీపురం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సోమవారం స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛాంధ్ర జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 48 మందికి అవార్డులు అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి రూపకల్పన చేసిన ఘనత సీఎం చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. పరిసరాల్లో మొక్కలు నాటాలని, తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందజేయాలని సూచించారు. పరిశుభ్రతతో వ్యాధులకు దూరంగా ఉండొచ్చని తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణానికి స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిఒక్కరూ పిల్లల పుట్టిన రోజున కచ్చితంగా ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. బహిరంగ మలవిసర్జన చేయరాదని, రెండు డెస్ట్ బిన్లను వాడాలని, ప్లాస్టిక్‌ను నిషేధించాలని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి సూచించారు.