Responsibility పరిసరాల పరిశుభ్రత.. అందరి బాధ్యత
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:17 AM
Cleanliness of Surroundings.. Everyone’s Responsibility పరిసరాల పరిశుభ్రత.. అందరి బాధ్యత అని పార్వతీ పురం సబ్ కలెక్టర్ వైశాలి అన్నారు. శనివారం సబ్ కలెక్టరేట్‌లో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చీపురుపట్టి కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు. గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
పార్వతీపురం, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్రత.. అందరి బాధ్యత అని పార్వతీ పురం సబ్ కలెక్టర్ వైశాలి అన్నారు. శనివారం సబ్ కలెక్టరేట్‌లో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చీపురుపట్టి కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు. గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనివల్ల డయేరియా, మలేరియా, చికున్‌గున్యా వంటి వాటికి దూరంగా ఉండొచ్చని వెల్లడించారు. ప్రతిఒక్కరూ పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రజలకు పరిశుభ్రత ఆవశ్యకతపై అవగాహన కల్పించి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్య క్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.