Share News

మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి: ఎమ్మెల్యే

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:19 PM

): కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించుకోవాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన పిలుపునిచ్చారు.

 మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి: ఎమ్మెల్యే
బొబ్బిలి: మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బేబీనాయన :

బొబ్బిలి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించుకోవాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన పిలుపునిచ్చారు. ఆదివారం బొబ్బిలికోటలో గ్రీన్‌బెల్ట్‌ సొసైటీ అధ్యక్షుడు ఎస్‌వీ రమణమూర్తి ఆధ్వ ర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మట్టి వినాయకవిగ్రహాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ రాంబార్కి శరత్‌బాబు, చింతా శారద, సుంకరి సాయిరమేష్‌, సత్యంనాయుడు, మీసాల చినగౌరునాయుడు, బాల భాస్కరరావు, చప్ప అప్పలనాయుడు పాల్గొన్నారు.

ఉత్సవాల నిర్వహణకు మార్గదర్శకాలు పాటించాలి

వినాయక ఉత్సవాల నిర్వహణకోసం జారీ చేసిన మార్గదర్శకాలను పాటిం చాలని బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి కోరారు.బొబ్బిలిలోని పాతబస్టాండ్‌ ఆరి గంగయ్య మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఆవరణలో రోటరీక్లబ్‌ అధ్యక్షుడు వారణాశి శ్రీహరి ఆధ్వర్యంలో వెయ్యి మట్టివినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. కార్యక్రమం లో శ్రీనివాసరావు, సాయిరమేష్‌, శివకాంత్‌, నాగరాజు, రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 11:19 PM