వైసీపీ, జనసేన వర్గీయుల కొట్లాట
ABN , Publish Date - May 24 , 2025 | 12:19 AM
మండలంలోని కొత్తపేటలో శుక్రవారం వైసీసీ, జనసేన వర్గీయుల మధ్య కొట్లాట జరిగింది.
-ఇరువర్గాలపై కేసుల నమోదు
నెల్లిమర్ల, మే 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్తపేటలో శుక్రవారం వైసీసీ, జనసేన వర్గీయుల మధ్య కొట్లాట జరిగింది. స్థానికంగా ఉన్న చెరువు నుంచి వైసీపీకి చెందిన సర్పంచ్ అట్టాడ శ్రీనివాసరావు ట్రాక్టర్‌తో మట్టి తర లిస్తుండగా జనసేన వర్గీయులు ప్రశ్నించడమే ఈ కొట్లాటకు కారణంగా తెలుస్తోంది. కొట్లాటలో సర్పంచ్ అట్టాడ శ్రీనివాసరావుతో పాటు జనసేనకు చెందిన సువ్వాడ రమణ, గురాన గోవింద, కల్యాణపు లోకేశ్, పంచాది రమణ గాయపడ్డారు. సర్పంచ్ శ్రీనివాసరావు విజయనగరం సర్వజన ఆసుపత్రిలో, జనసేన వర్గీయులు నెల్లిమర్ల మిమ్స్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరువర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు వర్గాలపై కేసులు నమోదు చేసినట్టు ఎస్‌ఐ బి.గణేశ్ తెలిపారు. ఇదిలా ఉండగా కొట్లాట ఘటన లో గాయపడి మిమ్స్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జనసేన వర్గీయులను ఎమ్మెల్యే లోకం నాగమాధవి పరామర్శించారు. కొట్లాటకు గల కారణాలపై ఆరా తీశారు. ఆమెతో పాటు కరుమజ్జి గోవింద్ ఉన్నారు.