పెట్రోల్ బంకు వద్ద ఘర్షణ
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:09 AM
పట్టణంలోని మెయిన్ రోడ్డులో పాత పెట్రోల్ బంకు వద్ద గురువారం రాత్రి ఘర్షణ జరిగింది.
చీపురుపల్లి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మెయిన్ రోడ్డులో పాత పెట్రోల్ బంకు వద్ద గురువారం రాత్రి ఘర్షణ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన తమ్మిన వెంకటేష్ అనే వ్యక్తి గురువారం రాత్రి తన ద్విచక్ర వాహనానికి పాత పెట్రోల్ బంకులో రూ.500 పెట్రోల్ వేయించా రు. అయితే, వేసిన పెట్రోల్‌కు తగినట్టుగా వాహనం మైలేజీ రాకపోవడంతో, బంకుకు వచ్చి ఫిర్యాదు చేశారు. వాహనంలోని పెట్రోల్ వేరే బాటిల్‌లోకి తీసి పరిశీలించారు. ఆ బాటిల్ అడుగు భాగంలో నీరు చేరడంతో, సిబ్బందిని నిలదీ శారు. అదే సమయంలో కొంతమంది ఆటో డ్రైవర్లు కూడా ఇదే రకమైన ఫిర్యాదు చేయడంతో, అక్కడ ఘర్షణ జరిగింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ దామోదరరావు బంకు వద్దకు చేరుకుని ఇరు వర్గాల వారిని స్టేషన్‌కు తరలించడంతో, వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.