Civil Services Coaching గిరిజన యువతకు సివిల్స్ కోచింగ్
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:00 AM
Civil Services Coaching for Tribal Youth సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న గిరిజన నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు.
సీతంపేట రూరల్, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న గిరిజన నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. విద్య, కుల, ఆధాయ ధ్రువపత్రాలతో పాటు ఆధార్, పాన్‌కార్డు, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో ఈనెల 26 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8లక్షలలోపు ఉండాలని తెలిపారు. విశాఖ, విజయవాడ, తిరుపతి కేంద్రాల్లో ఉచిత శిక్షణ ఉంటుందన్నారు.