క్రిస్మస్ సందడి
ABN , Publish Date - Dec 25 , 2025 | 10:35 PM
జిల్లావ్యాప్తంగా గురువారం క్రైస్తవులు క్రిస్మస్‌ను ఉత్సాహంగా జరుపుకొన్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచే సంబరాలు చేసుకున్నారు.
-జిల్లా వ్యాప్తంగా వేడుకలు
-చర్చిల్లో క్రైస్తవుల
పార్వతీపురం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా గురువారం క్రైస్తవులు క్రిస్మస్‌ను ఉత్సాహంగా జరుపుకొన్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచే సంబరాలు చేసుకున్నారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. స్వీట్లు, కేకులు పంచిపెట్టారు. కొన్నిచోట్ల ఏసు జనన ఘట్టం తెలియజేసేలా ప్రతిమలు, క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేశారు. ప్రార్థనాలయాల్లో కొవ్వొత్తులు వెలిగించి ఏసును స్మరించుకున్నారు. జిల్లాలోని 15 మండలాల్లో చర్చిలన్నీ విద్యుత్ దీపాలతో వెలిగిపోయాయి.
క్రీస్తు బోధనలు అనుసరణీయం: మంత్రి సంధ్యారాణి
సాలూరు, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. గురువారం సాలూరు చర్చిల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆమె పాల్గొని ప్రార్థనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఏసు చూపించిన మార్గాన్ని అనుసరించి ఒకరికొకరు సహాయం చేసుకోవాలని, ధ్వేషాన్ని విడిచిపెట్టి శాంతిని పంచాలన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, బాధలో ఉన్నవారిని ఓదార్చడం నిజమైన క్రిస్మస్ సందేశమని అన్నారు.