Share News

Christmas Festivities క్రిస్మస్‌ సందడి

ABN , Publish Date - Dec 25 , 2025 | 12:25 AM

Christmas Festivities జిల్లాకు క్రిస్మస్‌ పండుగ కళ వచ్చేసింది. ఇళ్లు, చర్చిలు విద్యుత్‌ దీపాలతో అందంగా ముస్తాబయ్యాయి. క్రిస్మస్‌ ట్రీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Christmas Festivities  క్రిస్మస్‌ సందడి
పాలకొండ ఆర్‌సీఎం చర్చిలో ప్రార్థనలు చేస్తున్న దృశ్యం

ప్రారంభమైన ప్రార్థనలు

పార్వతీపురం, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): జిల్లాకు క్రిస్మస్‌ పండుగ కళ వచ్చేసింది. ఇళ్లు, చర్చిలు విద్యుత్‌ దీపాలతో అందంగా ముస్తాబయ్యాయి. క్రిస్మస్‌ ట్రీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. శాంతాక్లాజ్‌ వేషధారణలో పిల్లలు, పెద్దలు ముందురోజు నుంచే సందడి చేశారు. బుధవారం రాత్రి వీధుల్లో క్రీస్తు భక్తి గీతాలాపన చేస్తూ ర్యాలీలు చేపట్టారు. క్రిస్మస్‌ రోజు గురువారం క్రైస్తవులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోనున్నారు. కుటుంబాల సమేతంగా భోజనాలు చేయనున్నారు. ఆహ్లాద, ఆనందకరమైన వాతావరణంలో ప్రార్థనలు చేయనున్నారు. పండుగ నేపథ్యంలో ప్రధాన చర్చిలు నూతన కళను సంతరించుకున్నాయి.

Updated Date - Dec 25 , 2025 | 12:25 AM