Christmas bustle in the city నగరంలో క్రిస్మస్ సందడి
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:12 AM
Christmas bustle in the city నగరంలో క్రిస్మస్ పండుగ సందడి నెలకొంది. చర్చిలు విద్యుత్ దీపాలతో కొత్త కాంతులు సంతరించుకున్నాయి. పది రోజులుగా వివిధ చర్చిల్లో వేడుకలు జరుగుతున్నాయి.
నగరంలో క్రిస్మస్ సందడి
విద్యుత్ వెలుగుల్లో చర్చిలు
విజయనగరం కల్చరల్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): నగరంలో క్రిస్మస్ పండుగ సందడి నెలకొంది. చర్చిలు విద్యుత్ దీపాలతో కొత్త కాంతులు సంతరించుకున్నాయి. పది రోజులుగా వివిధ చర్చిల్లో వేడుకలు జరుగుతున్నాయి. ఈ నెల 25న అసలు పండుగ సందర్భంగా విజయనగరంలోని ప్రధాన చర్చిలు.. ఇళ్ల ముందు క్రిస్మస్ స్టార్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. క్రిస్టియన్ స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. క్రిస్మస్ కేక్‌లు కట్ చేసి సందడి చేస్తున్నారు. నగరంలోని అతి పురాతన మైన బాప్టిస్ట్ చర్చి, ఆర్‌సీఎం , సెయింటాన్స్, సెయింట్ లూథరన్, స్వీమ్స్ ప్లాటినం చర్చిలు విద్యుత్ కాంతులతో కళకళలాడుతున్నాయి.
------------------------