Share News

డీసీసీబీలో ‘బాలల భవిష్యత్‌ నిధి’

ABN , Publish Date - Dec 24 , 2025 | 12:17 AM

: కార్పొరేట్‌ బ్యాంకులకు దీటుగా డీసీసీబీ, వాటి అనుబంధ శాఖలను తీర్చిదిద్దే లక్ష్యంతో వినూత్న పథకాలను అందుబాటు లోకి తీసుకు రానున్నట్టు డీసీసీబీ చైర్మన్‌ కిమి డి నాగార్జున చెప్పారు.

 డీసీసీబీలో ‘బాలల భవిష్యత్‌ నిధి’

విజయనగరం రూరల్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కార్పొరేట్‌ బ్యాంకులకు దీటుగా డీసీసీబీ, వాటి అనుబంధ శాఖలను తీర్చిదిద్దే లక్ష్యంతో వినూత్న పథకాలను అందుబాటు లోకి తీసుకు రానున్నట్టు డీసీసీబీ చైర్మన్‌ కిమి డి నాగార్జున చెప్పారు. మంగళవారం డీసీసీ బీలో నలుగురు ఖాతాదారులు రూ.13.70 లక్షలు డిపాజిట్‌ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ నాగార్జున వారికి సంబంధిత పత్రాలను అందించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. ఈ నెల 10 నుంచి ‘బాలల భవిష్యత్‌ నిధి’ పథకానికి రూపకల్పన చేశామన్నారు. ఈ పథకం ద్వారా ఎంతో ప్రయెజనం ఉంటుందని చెప్పారు. ఏడాది నుంచి 10 ఏళ్లలోపు బాలబా లికల పేరిట రూ.వెయ్యి వంతున డీసీసీబీలో డిపాజిట్‌ చేస్తే... వారికి 21 ఏళ్లు వచ్చేసరికి అధిక ఆర్థిక ప్రయోజనం చేకూరేలా ఈ పథ కం ఉందన్నారు. ఏడేళ్ల పాటు క్రమం తప్ప కుండా ప్రతి నెల రూ.వెయ్యి చొప్పున డిపాజిట్‌ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ పఽథకాన్ని డీసీసీబీ ప్రధాన శాఖతో పాటు, వివిధ శాఖల్లో ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారని తెలిపారు. ముగింపు గడువు ఏదీ లేదని... ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

డిపాజిట్ల పెంపే లక్ష్యం..

విజయనగరం డీసీసీబీ, అనుబంధ శాఖల్లో విస్తృతంగా డిపాజిట్లు సేకరించాలని, తద్వారా రానున్న కాలంలో డీసీసీబీ ద్వారా వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయాలని అధికారులకు ఆ దేశాలిచ్చామని చైర్మన్‌ నాగార్జున చెప్పారు. మంగళవారం ఒక్కరోజే ఆదినారాయణ, స్వాతి, జి.భాగ్యశ్రావణి, విజయ అనే వ్యక్తులు రూ.13 లక్షల 70 వేలు డిపాజిట్‌ చేశారని చెప్పారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ డీసీసీబీలో డి పాజిట్లు పెట్టాలని పిలుపునిచ్చారు. డీసీసీబీ ద్వారా నిబంధనల ప్రకారం రుణాలు కూడా మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. విజయనగరం డీసీసీబీ బ్రాంచ్‌ మేనేజర్‌ రాజు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2025 | 12:17 AM