Childrens బాలలే భవిష్యత్ వెలుగులు
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:07 AM
Children – The Lights of Our Future నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్ వెలుగులని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
బెలగాం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి) : నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్ వెలుగులని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలు రోజూ సంతోషంగా, ఉత్సాహంగా ఉంటేనే ఆనందంగా ఉంటుందన్నారు. శ్రద్ధతో ఏ పని చేసినా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ప్రతి పాఠశాలలో ఆఖరి గంట ఆటపాటలతో పిల్లలు గడిపేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి విద్యార్థి పరిశుభ్రమైన దస్తులు ధరించాలని, క్రమ శిక్షణతో ఉండాలనే ఉద్దేశంతో ముస్తాబు కార్య క్రమం నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో ప్రతిభ కనబరిస్తే జిల్లాలో స్పోర్ట్స్ పాఠశాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అనంతరం పలు పాఠశాలల విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మనీషారెడ్డి, ఐసీడీఎస్ పీడీ విజయగౌరి, డీఈవో రాజ్‌కుమార్, ప్రిన్సిపాల్ శైలజ తదితరులు పాల్గొన్నారు.