Child Marriages బాల్య వివాహాలు నేరం
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:34 PM
Child Marriages Are a Crime బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వాటిని అడ్డుకో వాలని జిల్లా బాలల సంరక్షణాధికారి అల్లు సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
సాలూరు, డిసెంబరు19(ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వాటిని అడ్డుకో వాలని జిల్లా బాలల సంరక్షణాధికారి అల్లు సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బాల్య వివాహ ముక్త్ భారత్’లో భాగంగా ప్రజలను చైతన్య పరుస్తున్నామన్నారు. బాల్య వివాహాల నుంచి బాలికలను కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని తెలిపారు. బాలికల కలలను సాకారం చేసుకునే అవకాశాలను కల్పించాలని సూచించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే.. 1098, 112, 181 నెంబర్లకు ఫోన్‌చేసి సమాచారం అందించాలని కోరారు. అనంతరం విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ విభాగం కౌన్సిలర్ తవిటినాయుడు, మహిళా పోలీసులు, అంగన్‌వాడీ టీచర్లు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.