Share News

ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీ

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:36 PM

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదివారం సాలూరులోని తన స్వగృహంలో లబ్ధిదారులకు అందజేశారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీ

సాలూరు, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదివారం సాలూరులోని తన స్వగృహంలో లబ్ధిదారులకు అందజేశారు. మొత్తం రూ.3 లక్షల 62వేల 917ల విలువైన చెక్కులను పంపిణీ చేశా రు. పట్టణంలోని 11వ వార్డు చినహరిజనపేటకు చెందిన దివాకల తులసికి రూ.49,258, ఏడో వార్డు గాంధీనగర్‌కు చెందిన చింత వాసుదేవకు రూ.47,642, 21వ వార్డు తెలగావీధికి చెందిన వానపల్లి రమణమ్మకు రూ.50వేలు విలువైన చెక్కును అందజేశారు. అలాగే పాచిపెంట మండలంలోని మోసూరుకు చెందిన బొట్టా గౌరీశంకరరా వుకు రూ.30,700, మెంటాడ మండలం బాడేవలసకు చెందిన నీలిరోతు ప్రశాంత్‌కు రూ.85వేలు, మక్కువ మండలం పనసభద్రకు చెందిన కోట శేషగిరిరావుకు రూ.లక్షా 317ల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్ర మంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో..

బొబ్బిలి, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి నియోజకవర్గం పరిధిలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బేబీనాయన అందజేశారు. ఆదివారం బొబ్బిలి కోటలోని తన క్యాంపు కార్యాలయంలో రూ.10లక్షల విలువగల చెక్కులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. గొర్లె సీతారాంపురం గొర్లె వెంటకరమణకు రూ.2.70లక్షలు, తెంటువలస గొదబ రాజా రమేష్‌కు రూ.1.69 లక్షలు, సుందరాడ ముత్త సత్యంకు రూ.లక్ష, కొట్టక్కి లక్ష్మీపట్నాయక్‌కు రూ.68వేలు, గొల్లపల్లి పైల సీతారాంకు రూ.55వేలు, 15 వవార్డు రాంబార్కి ప్రసన్నకు రూ.45వేలు, కోడూరు కొల్లి రమణమ్మకు రూ.45 వేలు, కోమటిపల్లి ఆవాల రమణమ్మకు రూ.40వేలు, చెలికాని రాధకు రూ.36వేలు, శిస్టు సీతారాంపురం బొత్స రామసాయికి రూ.35వేలు, పాతరేగ వైకుంఠం వెంకటనాయుడుకు రూ.35వేలు, పి.వెంకంపేట మూడడ్ల పైడితల్లికి రూ.28వేలు, కలవరాయి కోరాడ గణేశ్‌కు రూ.25 వేలు, అలజంగి గ్రామానికి చెందిన రెడ్డి రాములుకు రూ.24వేలు చొప్పున మంజూరవడంతో ఆ కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చుల నిమిత్తం ఈ చెక్కులను అందజేశారు.

Updated Date - Jun 15 , 2025 | 11:36 PM