Share News

Chief Minister to visit the district today నేడు జిల్లాకు ముఖ్యమంత్రి రాక

ABN , Publish Date - Sep 30 , 2025 | 11:33 PM

Chief Minister to visit the district today ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం జిల్లాకు వస్తున్నారు. దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో పేదలకు పింఛన్లను పంపిణీ చేస్తారు. అనంతరం వారితో ముఖాముఖిలో పాల్గొంటారు.

Chief Minister to visit the district today నేడు జిల్లాకు ముఖ్యమంత్రి రాక

నేడు జిల్లాకు ముఖ్యమంత్రి రాక

విజయనగరం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం జిల్లాకు వస్తున్నారు. దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో పేదలకు పింఛన్లను పంపిణీ చేస్తారు. అనంతరం వారితో ముఖాముఖిలో పాల్గొంటారు. టీడీపీ శ్రేణులతోనూ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఆయన పర్యటన ఏర్పాట్లను మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్‌లు మంగళవారం పరిశీలించారు. కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి, ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌, ఇతర అధికారులతో కలిసి చర్చించారు. సీఎం పర్యటనకు సంబంధించిన మ్యాప్‌ను కూడా మంత్రులు పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు.

Updated Date - Sep 30 , 2025 | 11:33 PM