ఓటర్ల జాబితా పరిశీలించుకోండి: పీడీ
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:56 PM
ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులను పరిశీలించుకోవాలని ఎలక్ర్టోరల్ రిజిస్ర్టేషన్ ఆఫీసర్, డీఆర్‌డీఏ పీడీ సుధారాణి కోరారు.
సాలూరు, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులను పరిశీలించుకోవాలని ఎలక్ర్టోరల్ రిజిస్ర్టేషన్ ఆఫీసర్, డీఆర్‌డీఏ పీడీ సుధారాణి కోరారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ1200 మంది ఓటర్ల దాటిన పోలింగ్‌బూత్‌లను మార్పులు చేస్తామని తెలిపారు. ఓటర్లు జాబితా, పోలింగ్ స్టేషన్లకు సంబంధించి పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పవచ్చని పేర్కొన్నారు.
ఫ పాచిపెంట, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో వెలుగు సంఘ సభ్యులకు మంజూరైన పలు పథకాల నిర్వహణపై డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి పరిశీలించారు. కర్రివలస పంచాయతీ చాపరాయివలసలో మహిళా సంఘ సభ్యురాలు కూనేటిలక్ష్మి పీఎంఈజీపీ పథకం ద్వారా ఏర్పాటుచేసిన నాటు కోళ్ల పెంపకం కేంద్రాన్ని, అదే గ్రామంలో గల డెయిరీ ఫారం యూనిట్, అనంత రం అమ్మవలస మెగాగోకులంలో ఆవులు పెంపకం యూనిట్ పరిశీలించారు. పాచిపెంట వెలుగు కార్యాలయంలో రైతు ఉత్పత్తిదారుల సమాఖ్యను పరిశీలించా రు. ఆమెవెంట డీపీఎం రాజ్యలక్ష్మి, ఏపీఎం సత్యనారాయణ ఉన్నారు.