Share News

Check the problems with regularization! క్రమబద్ధీకరణతో ఇక్కట్లకు చెక్‌!

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:40 AM

Check the problems with regularization! సింహాచలం నాయుడు (అసలు పేరు కాదు) చిరుద్యోగి. అద్దె ఇంట్లో ఉంటున్నాడు. కొన్ని కారణాలతో తరచూ ఇల్లు మారాల్సి వస్తోంది. ఎలాగైనా సొంతిల్లు కట్టుకోవాలని శృంగవరపుకోట మేజర్‌ పంచాయతీ పరిధిలోని ఓ లేఅవుట్‌లో 150 గజాల ప్లాట్‌ (ఇంటి స్థలం) కొనుగోలు చేశాడు. ఇంటి నిర్మాణం అనుమతుల కోసం పంచాయతీ అధికారులను సంప్రదించాడు. ఆ లేఅవుట్‌కు విశాఖ మెట్రోపాలిటిన్‌ రీజియన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీ(వీఎంఆర్‌డీఏ) అనుమతులు లేవని ఇంటి నిర్మాణానికి పంచాయతీ అనుమతి నిరాకరించింది

Check the problems with regularization! క్రమబద్ధీకరణతో  ఇక్కట్లకు చెక్‌!

క్రమబద్ధీకరణతో

ఇక్కట్లకు చెక్‌!

అనధికార ప్లాట్ల కొనుగోలుదారులకు అవకాశం

జూన్‌ నెలాఖరులోపు కొన్నవారికి చాన్స్‌

సేల్‌ డీడ్‌ తప్పనిసరి

ఫీజు, ఓపెన్‌స్పేస్‌ చార్జీల్లోనూ రాయితీలు

ఇంకా రెండు నెలలకు పైగా గడువు

శృంగవరపుకోట, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి):

సింహాచలం నాయుడు (అసలు పేరు కాదు) చిరుద్యోగి. అద్దె ఇంట్లో ఉంటున్నాడు. కొన్ని కారణాలతో తరచూ ఇల్లు మారాల్సి వస్తోంది. ఎలాగైనా సొంతిల్లు కట్టుకోవాలని శృంగవరపుకోట మేజర్‌ పంచాయతీ పరిధిలోని ఓ లేఅవుట్‌లో 150 గజాల ప్లాట్‌ (ఇంటి స్థలం) కొనుగోలు చేశాడు. ఇంటి నిర్మాణం అనుమతుల కోసం పంచాయతీ అధికారులను సంప్రదించాడు. ఆ లేఅవుట్‌కు విశాఖ మెట్రోపాలిటిన్‌ రీజియన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీ(వీఎంఆర్‌డీఏ) అనుమతులు లేవని ఇంటి నిర్మాణానికి పంచాయతీ అనుమతి నిరాకరించింది. తాను కొనుగోలు చేసిన ప్లాటు అనధికార లేఅవుట్‌లో ఉందని అంతవరకు ఆయనకు తెలియదు. ఇలాంటి వారు జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నారు. వందల సంఖ్యలో అనధికార లేఅవుట్‌లు ఉన్నాయి. వీటిని క్రమబద్ధీక రించేందుకు ప్రభుత్వం లేఅవుట్‌ రెగ్యులైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌)ను తీసుకొచ్చింది.

విభజిత జిల్లాలో 349 అనధికార లేఅవుట్‌లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ అంతకు రెండు రేట్లు ఎక్కువే ఉంటాయి. జిల్లాలో దాదాపుగా అన్ని మండలాలు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఎ) పరిధిలోకి వెళ్లాయి. మిగిలిన మండలాలు బొబ్బిలి పట్టణాభివృద్ధి సంస్థ (బుడా) పరిధిలో ఉన్నాయి. నిబంధనల ప్రకారం వీఎంఆర్‌డీఏ పరిధిలోని ప్రాంతాల్లో లేఅవుట్‌ ఏర్పాటుకు ఆ సంస్థ అనుమతి ఉంది. అలాగే బుడా పరిఽధిలోకి వచ్చే ప్రాంతాల్లో ఈ సంస్థ అనుమతిని లేఅవుట్‌ యజమానులు పొందాలి. కానీ అనుమతి తీసుకోవడం లేదు. వారు నిబంధనల ప్రకారం లేఅవుట్‌ వేయకపోవడం వల్లే అనుమతి పొందేందుకు ప్రయత్నించడం లేదు. పక్కనున్న ప్రభుత్వ భూముల్లో కలిపేసుకుంటున్న వారు కొందరైతే, గెడ్డలు, చెరువులు, పోరంబోకు స్థలాలను అక్రమించి లేఅవుట్‌లో కలిపేసుకుంటున్నవారు మరికొందరు. పూర్తిగా డి.పట్టా భూమిలో లేఅవుట్‌లు వేసి జిరాయితీ సర్వే నెంబర్‌తో ప్లాట్లను విక్రయించేవారికీ కొదవ లేదు.

అంతా వక్రమార్గంలోనే..

రోడ్లు, కాలువలు, విద్యుత్‌, తాగునీరు, ఆటస్థలాలు వంటివేవీ చాలా లేఅవుట్‌లలో ఉండడం లేదు. వీఎంఆర్‌డీఏ, బుడా అనుమతులు తీసుకుంటే ఇవన్నీ బయటపడతాయన్న కారణం ఒకటైతే, భారీగా ఖర్చు చేస్తే అనుకున్న లాభాలు రావని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పు చేయకుండానే లేఅవుట్‌లను తీర్చిదిద్దిన వారు ఉన్నారు. దీంతో జిరాయితీ స్థలంలోని లేఅవుట్‌ ప్లాట్లు కొనుగోలు చేసేవారికి కూడా ఇంటి నిర్మాణం చేపట్టేందుకు పంచాయతీ, మున్సిపల్‌ కార్యాలయ అనుమతులు పొందలేకపోతున్నారు. ఇలాంటి బాధితులకు ప్రభుత్వం పాట్లు, లేఅవుట్‌లను క్రమబద్ధీకరించేందుకు ముందుకు వచ్చింది.

గత నెల 26 నుంచి అవకాశం

2025 జూన్‌ 30కు ముందు ఇలాంటి లేవుట్‌లల్లో కొనుగోలు చేసిన ప్లాట్లు, లేఅవుట్‌ యజమానులు క్రమబద్ధీకరణకు ఎల్‌ఆర్‌ఎస్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటిస్థలం కొన్న రిజిస్ర్టేషన్‌ దస్తావేజులు, లేఅవుట్‌ కాపీ అప్‌లోడ్‌ చేయాలి. ఫీజులో రూ.10వేలకు తగ్గకుండా ప్రాథమికంగా చెల్లించాలి. ఫీజు మొత్తం 45రోజుల్లో చెల్లిస్తే 10శాతం రాయితీ, 45నుంచి90 రోజుల్లో చెల్లిస్తే 5శాతం రాయితీ వర్తిస్తుంది. క్రమబద్ధీకరణ ఫీజు కాకుండా చెల్లించిన 14శాతం ఓపెన్‌స్పేస్‌ చార్జీల్లోను 7శాతం రాయితీ ఇవ్వనున్నారు. జూలై 26 నుంచి ఈ పథకం అందుబాటులో ఉంది. ఆ రోజు నుంచి 90 రోజుల్లోగా దరఖాస్తులకు అనుమతించారు. అంటే అక్టోబర్‌ 25లోపు దరఖాస్తులు చేసుకొనేందుకు వీలుంది. ఇప్పటికే 25 రోజులు పూర్తయింది. మరో 65 రోజులు గడువుంది. దరఖాస్తు అనంతరం క్షేత్ర స్థాయిలో లేఅవుట్‌ పరిశీలన ఉంటుంది. కనిష్ఠంగా 30 అడుగులు రోడ్లు ఉండేలా చూస్తారు. ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. అభ్యంతరాలు లేని దరఖాస్తుదారుల నుంచి మిగిలిన ఫీజు వసూలు చేస్తారు. అనంతరం ప్లాట్లను క్రమబద్ధీకరణ చేస్తారు. ఆపై వీటికి పంచాయతీ, మునిసిపల్‌ శాఖలు ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండా అనుమతులు ఇస్తాయి. లేఅవుట్‌లో మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఇంటి నిర్మాణానికి బ్యాంకు రుణం లభిస్తుంది. అనధికార లేఅవుట్‌ల్లో కొనుగోలు చేసుకున్న పాట్లను క్రమబద్ధీకరించేందుకు నిర్దేశించిన ఫీజు, కన్వర్సన్‌ చార్జీలు. ఓపెన్‌ స్పేస్‌, వదలని వాటికి చార్జీలతో పాటు స్థలాన్ని బట్టి రుసం వసూలు చేయనున్నారు. క్రమబద్ధీకరణ జరగని ప్లాట్లను చట్టవిరుద్ధమైనవిగా భావిస్తారు. అనుమతులు పొందడం కష్టం.

ఇలా దరఖాస్తు చేసుకోండి

- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ప్లాటు కొనుగోలు చేసినట్లు ధ్రువీకరించే రిజిస్ట్రేషన్‌ పత్రాలతో పాటు లింకు డాక్యూమెంట్లు అప్‌లోడ్‌ చేయాలి.

- వన్‌బీ, ఈసీ, సైట్‌ప్లాన్‌, లొకేషన్‌ ప్లాన్‌, ల్యాండ్‌ కన్వర్షన్‌ సర్టిఫికెట్‌ (2006 జనవరి 2కు ముందు రిజిస్ట్రేషన్‌ చేసుకొన్నవారికి తప్ప) ఇవ్వాలి.

-------------------

Updated Date - Aug 22 , 2025 | 12:40 AM