Check on Bogus బోగస్ మస్తర్లకు చెక్
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:10 AM
Check on Bogus musters ఉపాధి హామీ పథకంలో బోగస్ మస్తర్ల నిరోధానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇకపై ఈకేవైసీ పూర్తయిన వేతనదారులకే పనులు కల్పిం చనున్నారు. అయితే ఇప్పటివరకు ఈకేవైసీ చేసుకోని వారికోసం గరుగుబిల్లి మండలంలో శని వారం గ్రామసభలు నిర్వహించారు.
గరుగుబిల్లి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో బోగస్ మస్తర్ల నిరోధానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇకపై ఈకేవైసీ పూర్తయిన వేతనదారులకే పనులు కల్పిం చనున్నారు. అయితే ఇప్పటివరకు ఈకేవైసీ చేసుకోని వారికోసం గరుగుబిల్లి మండలంలో శని వారం గ్రామసభలు నిర్వహించారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 3,82,345 మంది వేతన దారులకు గాను 3,80,874 మందికి ఆధార్ అనుసంధానం జరిగింది. 3,80,712 మందికి ఈకేవైసీ పూర్తయింది. సుమారు 88 శాతం మేర ఈ ప్రక్రియ జరగ్గా.. మరికొద్ది రోజుల్లో శత శాతం పూర్తి చేసేందుకు సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. గతంలో ఒకరి జాబ్‌కార్డుపై మరొకరు పనులకు హాజరయ్యేవారు. బోగస్ మస్తర్లతో నిధులు పక్కదారి పట్టించేవారు. అయితే ఇకపై అలా కుదరుదు. ఈకేవైసీ చేసుకోకుండా ఎవరు పనులకు హాజరైనా వేతనాలు అందవు.