Share News

Check crime with e-beat ఈ-బీట్‌తో నేరాలకు చెక్‌

ABN , Publish Date - May 16 , 2025 | 12:04 AM

Check crime with e-beat

Check crime with e-beat ఈ-బీట్‌తో నేరాలకు చెక్‌
పోలీసు అధికారులతో జూమ్‌ సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ వకుల్‌జిందాల్‌

ఈ-బీట్‌తో నేరాలకు చెక్‌

పోలీసు గస్తీ మరింత పటిష్టం

ఎస్పీ వకుల్‌ జిందాల్‌

విజయనగరం క్రైం, మే 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నేరాలను నియంత్రించేందుకు ఈబీట్‌ విధానం బాగా ఉపయోగపడుతుందని ఎస్పీ వకుల్‌జిందాల్‌ అన్నారు. పోలీసు అధికారులతో ఈ బీట్‌ విధానంపై గురువారం జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసు గస్తీలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే ఈ బీట్‌ విధానంతో గస్తీ మరింత పటిష్టం అవుతుందని, పోలీసు పహారాను సమర్థంగా అమలు చేయగలుగుతామన్నారు. స్టేషన్‌లో పనిచేసే పోలీసు అధికారులు, సిబ్బందికి ముందుగా యూజర్‌ ఐడీలు, పాస్‌వర్డ్‌లు క్రియేట్‌ చేస్తామని, స్టేషన్‌ పరిధిలోని వివిధ ప్రాంతాలను బీట్‌లుగా విభజించి అక్కడున్న సీసీ కెమెరాలకు రాత్రి లేదా పగలు పహారాకు వెళ్లే పోలీసుల యూజర్‌ ఐడీతో అనుసంధానం చేస్తామన్నారు. ఏటీఎం కేంద్రాలు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, బ్యాంకులు, లాకడ్‌ హౌస్‌లు, హిస్టరీ షీట్‌ కలిగిన వ్యక్తులు తిరిగే ప్రాంతాలు, షాపింగ్‌ మాల్స్‌ వద్ద ఎంత సమయం పహారా, గస్తీ తిరిగారన్న విషయాలు నమోదవుతాయన్నారు. ఈ బీట్‌ యాప్‌ పనిచేసే విధానంపై టెక్నీషియన్‌ హర్ష బందలం జూమ్‌ ద్వారా అధికారులు, సిబ్బందికి నివృత్తి చేశారు. ఏఎస్‌పీ సౌమ్యలత, సీఐలు లీలారావు, ఆర్‌వీఆర్‌కె చౌదరి తదితరులు పాల్గొన్నారు.

ఈ-ఆఫీస్‌తో ఫైళ్లకు భద్రత

పరిపాలనలో పారదర్శకత, వేగవంతమైన సేవలు అందించడంతో పాటు ఫైళ్లకు భద్రత ఈ-ఆఫీస్‌తోనే సాధ్యమని ఎస్పీ వకుల్‌జిందాల్‌ అన్నారు. ఈ-ఆఫీస్‌ విధానం అమలుపై పోలీసు కార్యాలయ ఉద్యోగులకు జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రభుత్వం డిజిటైలేజేషన్‌ దిశగా అడుగులు వేస్తూ కార్యాలయ పరిపాలనలో పారదర్శక సేవలను వేగవంతంగా అందించేందుకు ఈ-ఆఫీస్‌ను ప్రారంభించిందన్నారు. ఈ వ్యవస్థ ద్వారా నోట్‌ ఫైల్స్‌, నిర్ణయాలు, అధికారుల మధ్య సమాచార మార్పిడి పూర్తిస్థాయిలో డిజిటల్‌ రూపంలో జరుగుతుందన్నారు. భవిష్యత్తులో కూడా ఫైల్స్‌ పాడవ్వడం, కాలిపోవడం వంటి ఇబ్బందులు ఉండవన్నారు. కార్యక్రమంలో ఈ-ఆఫీస్‌ జిల్లా అధికారి నరేంద్ర, ఏఎస్‌పీ సౌమ్యలత, ఏవో శ్రీనివాసరావు, పర్యవేక్షకులు రామకృష్ణ, వెంకటలక్ష్మీ, సీఐలు లీలారావు, ఆర్‌వీఆర్‌కె చౌదరి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2025 | 12:04 AM