Share News

Check Cancer స్ర్కీనింగ్‌తో క్యాన్సర్‌కు చెక్‌

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:31 PM

Check Cancer with Screening ముందస్తు స్ర్కీనింగ్‌ పరీక్షలతో క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. జాతీయ క్యాన్సర్‌ అవగాహన దినం సందర్భంగా శుక్రవారం జిల్లా ఆరోగ్య కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్యకర జీవనశైలి, క్యాన్సర్‌ రహిత నినాదాలతో పట్టణంలో ర్యాలీ చేశారు.

 Check Cancer  స్ర్కీనింగ్‌తో క్యాన్సర్‌కు చెక్‌
అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో

పార్వతీపురం, నవంబరు7(ఆంధ్రజ్యోతి): ముందస్తు స్ర్కీనింగ్‌ పరీక్షలతో క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. జాతీయ క్యాన్సర్‌ అవగాహన దినం సందర్భంగా శుక్రవారం జిల్లా ఆరోగ్య కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్యకర జీవనశైలి, క్యాన్సర్‌ రహిత నినాదాలతో పట్టణంలో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ క్యాన్సర్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆరోగ్యకర జీవనశైలిని అలవాటు చేసుకోవాలని తెలిపారు. వైద్యాధికారులు, వైద్య సిబ్బంది క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. రోగుల్లో క్యాన్సర్‌ ప్రాథమిక లక్షణాలను సత్వరమే గుర్తించి మెరుగైన వైద్య సేవలు అదించాలన్నారు. లక్ష్యాలు చేరుకునేలా సర్వే నిర్వహించాలని జిల్లా ఎన్‌సీడీ అధికారి టి.జగన్మోహన్‌రావు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఐవో విజయ్‌మోహన్‌, ప్రోగ్రాం అధికారులు రఘుకుమార్‌, కౌశిక్‌, లీలారాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2025 | 11:31 PM