Ganja! వెంబడించి.. గంజాయిని పట్టుకుని!
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:10 AM
Chased Down… and Caught with Ganja! ఆంధ్రా-ఒడిశా సరిహద్దు బత్తిలి చెక్‌పోస్టు వద్ద శుక్రవారం ఒడిశా నుంచి వచ్చిన ఓ కారు ఆగకుండా దూసుకెళ్లింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సినీ స్టైల్‌లో ఛేజ్ చేశారు.
పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులు.. కారు స్వాధీనం
భామిని, నవంబరు14(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా-ఒడిశా సరిహద్దు బత్తిలి చెక్‌పోస్టు వద్ద శుక్రవారం ఒడిశా నుంచి వచ్చిన ఓ కారు ఆగకుండా దూసుకెళ్లింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సినీ స్టైల్‌లో ఛేజ్ చేశారు. గురండి, బిల్లుమడ, సింగిడి, భామిని సెంటర్‌లో పలువురు యువతకు ఫోన్‌లో సమాచారం అందించారు. కారును అడ్డుకోవాలని సూచించారు. మరోవైపు పోలీసులు సుమారు 20 కిలోమీటర్ల మేర ఆ కారును వెంబడించారు. భామినిలో యువత మరో అడుగేసి రోడ్డుకు అడ్డంగా యువత ట్రాక్టర్ పెట్టారు. అయితే ముందుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆ కారు డ్రైవర్ వెనక్కి మళ్లించి బురుజోల గ్రామం వైపు వెళ్లాడు. అక్కడ నుంచి మార్గం లేకపోవడంతో కొత్తగూడ వద్ద కారు నిలిచిపోయింది. అదే సమయంలో అక్కడుకు చేరుకున్న హెచ్‌సీ శ్రీనివాస రావు, భామిని యువత కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వాహనం డిక్కీని పరిశీలించగా.. గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. దీంతో నిందితులను బత్తిలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా.. దర్యాప్తు చేస్తున్నామని, ఉన్నతాధికారులు కేసు వివరాలు ప్రకటిస్తారని వెల్లడించారు.