Chaos in Ration Depots రేషన్ డిపోల్లో రాగులు
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:48 PM
Chaos in Ration Depots జిల్లాలోని రేషన్ డిపోల ద్వారా ఈ నెల నుంచే కార్డుదారులకు రాగులు సరఫరా చేయనున్నారు. ప్రజలకు పౌష్టికాహారం అందించాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు అధికారులు ఈ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే అర్బన్ ఎంఎల్‌ఎస్ పాయింట్లు సాలూరు, పాలకొండ, పార్వతీపురంలో 150 టన్నులు రాగులను అందుబాటులో ఉంచారు.
తొలుత అర్బన్ ప్రాంతాల్లోనే..
పాలకొండ, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రేషన్ డిపోల ద్వారా ఈ నెల నుంచే కార్డుదారులకు రాగులు సరఫరా చేయనున్నారు. ప్రజలకు పౌష్టికాహారం అందించాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు అధికారులు ఈ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే అర్బన్ ఎంఎల్‌ఎస్ పాయింట్లు సాలూరు, పాలకొండ, పార్వతీపురంలో 150 టన్నులు రాగులను అందుబాటులో ఉంచారు. బియ్యం వద్దనుకున్న కార్డుదారులకు రాగులను సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖాధికా రులు సన్నద్ధమవుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం బియ్యం, చక్కెర మాత్రమే అందించేవారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో నిత్యావసర సరుకులు ఆకాశన్నంటుతుండడం , ప్రజారోగ్యం దృష్ట్యా కూటమి ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. గతంలోనూ టీడీపీ ప్రభుత్వం రాగులు, రాగిపిండిని కార్డుదారులకు సరఫరా చేసేది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా పథకం కింద చిరుధాన్యాలను కొనుగోలు చేసి సరఫరా చేసేది. ప్రస్తుతం వాటిని సరఫరా చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే ప్రాసెసింగ్ చేసి కార్డుదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది.
రాగుల పంపిణీ ఇలా...
జిల్లా వ్యాప్తంగా 578 రేషన్ డిపోలు ఉన్నాయి. వాటి పరిధిలో 2.80 లక్షల కార్డులు ఉన్నాయి. మొత్తంగా ప్రతినెలా 8.31 లక్షల మంది రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకులు పొందు తున్నారు. జిల్లా వ్యాప్తంగా 5,200 టన్నుల బియ్యాన్ని కార్డుదారులకు ఉచితంగా అందిస్తున్నారు. అయితే ఈ నెల నుంచి బియ్యానికి బదులుగా రాగులును ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. కార్డుదారుల కోరిక మేరకు సుమారు మూడు కిలోలు నుంచి ఆరు కిలోల వరకు రాగులును ఉచితంగా అందించనున్నారు. ప్రస్తుతం చాలామంది కార్డుదారులు రేషన్ బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. అయితే తాజాగా బియ్యానికి బదులుగా ఉచితంగానే రాగులును సరఫరా చేస్తున్న నేపఽథ్యంలో అధికశాతం మంది వాటిని తీసుకొనేందుకే మొగ్గుచూపే అవకాశం ఉంది.
ఈ నెల నుంచే సరఫరా
‘జిల్లా వ్యాప్తంగా అర్బన్ ఎంఎల్‌ఎస్ పాయింట్లకు 150 టన్నుల రాగులును అందుబాటులో ఉంచాం. కార్డుదారులు కోరితే ఈ నెల నుంచే బియ్యానికి బదులుగా రాగులును ఉచితంగా సరఫరా చేయాలని డీలర్లను ఆదేశించాం. ’ అని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి బాలసరస్వతి తెలిపారు.