Share News

Changing Colors రంగులు మారుస్తూ.. ఆకర్షిస్తూ!

ABN , Publish Date - Sep 17 , 2025 | 11:58 PM

Changing Colors, Captivating All! సహజంగా ఊసరవెల్లి తన రంగులు మారుస్తూ ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే ఈ పువ్వు సైతం ఊసరవెల్లిలా రంగులు మార్చుతుంది. బాహినీయా వెరిగెట్టా జాతికి చెందిన ఓ మందారం పూలు సూర్యోదయం నుంచి మధ్యాహ్నం వరకు తెల్లగా ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత గులాబీ రంగులోకి మారుతాయి.

Changing Colors  రంగులు మారుస్తూ.. ఆకర్షిస్తూ!
పత్తి మందారం పూలు

సాలూరు రూరల్‌, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): సహజంగా ఊసరవెల్లి తన రంగులు మారుస్తూ ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే ఈ పువ్వు సైతం ఊసరవెల్లిలా రంగులు మార్చుతుంది. బాహినీయా వెరిగెట్టా జాతికి చెందిన ఓ మందారం పూలు సూర్యోదయం నుంచి మధ్యాహ్నం వరకు తెల్లగా ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత గులాబీ రంగులోకి మారుతాయి. కూనంబందవలసలో కొర్ర గంగమ్మ పెరటిలో ఉన్న పత్తి మందారం పూలు చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో పత్తి మందారమనే పిలిచే వాటిని పిలుస్తారు. దీనిపై ఉద్యాన శాఖాధికారి వై.ప్రత్యూష భానును వివరణ కోరగా... ‘ఆంథోసైనీ సిగ్మెంట్‌ సెన్సిటీవిటీ వల్ల కొన్ని పూల రంగులు ఇలా మారుతాయి. సూర్య కిరణాల వేడి అధికమయ్యేకొద్దీ సిగ్మెంట్‌ సెన్సిటీవిటీ వల్ల ముదురు రంగు సంతరించుకుంటుంది. ఇది పత్తి మందారం మొక్క సహాజ గుణం.’ అని తెలిపారు.

Updated Date - Sep 17 , 2025 | 11:58 PM