Share News

Change the Approach పద్ధతి మార్చుకోండి

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:57 PM

Change the Approach ‘కొందరు మిల్లర్లు రైతుల వద్ద రెండు నుంచి ఐదు కేజీల వరకు అదనంగా ధాన్యం వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చించి. ఇది సరికాదు.. పద్ధతి మార్చుకోండి.’ అని సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ సూచించారు. నిబంధనల మేరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు.

Change the Approach  పద్ధతి మార్చుకోండి
ధాన్యం ట్రాన్స్‌పోర్టు లారీని పరిశీలిస్తున్న దృశ్యం

పాలకొండ, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): ‘కొందరు మిల్లర్లు రైతుల వద్ద రెండు నుంచి ఐదు కేజీల వరకు అదనంగా ధాన్యం వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చించి. ఇది సరికాదు.. పద్ధతి మార్చుకోండి.’ అని సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ సూచించారు. నిబంధనల మేరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఆదివారం తుమరాడలోని ఓ రైస్‌మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. వారికి మద్దతు ధర దక్కేలా చూడాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను రెవెన్యూ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు. అనంతరం ధాన్యం శాంపిల్స్‌, రైస్‌మిల్లులోని రికార్డులు పరిశీలించారు.

Updated Date - Dec 07 , 2025 | 11:57 PM