Share News

చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: ఎంపీ

ABN , Publish Date - Nov 03 , 2025 | 11:55 PM

సీఎం చంద్రబాబుకి రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో స్పందించాయని తెలిపారు.సోమవారం విజయనగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఆ ఆలయ యాజమాన్యంతోపాటు భక్తుల ఉందన్నారు.

 చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: ఎంపీ
మాట్లాడుతున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

విజయనగరం రూరల్‌, నవంబరు 3 ( ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబుకి రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో స్పందించాయని తెలిపారు.సోమవారం విజయనగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఆ ఆలయ యాజమాన్యంతోపాటు భక్తుల ఉందన్నారు. ప్రతిదీ రాజకీయ కోణంలో చూసే వైసీపీ నాయకులు, ఈ అంశాన్ని రాజకీయం చేయాలనుకోవడం దురదృష్టకరమన్నారు. వైసీపీ నాయకులు మాటలు, విమర్శలు అర్ధం లేనివన్నారు. చంద్రబాబు లండన్‌ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనా..అక్కడకు వెళ్లి ప్రవాసాంధ్రులు, అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలని, విశాఖలో నిర్వహిస్తున్న సదస్సుకి తరలిరావాలని అక్కడి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నారన్నారు.

Updated Date - Nov 03 , 2025 | 11:55 PM