వనంగుడిలో ఘనంగా చండీహోమం
ABN , Publish Date - Jun 13 , 2025 | 12:07 AM
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడిమాంబ వనంగుడి (రైల్వే స్టేషన్ రోడ్డు)లో గురువారం చండీహోమాన్ని నిర్వహించారు.
విజయనగరం రూరల్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడిమాంబ వనంగుడి (రైల్వే స్టేషన్ రోడ్డు)లో గురువారం చండీహోమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు సాయికిరణ్‌శర్మ, టీఎఎన్ శర్మలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు పైడిమాంబను వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. పిండివంటలు, పండ్లను నైవేద్యంగా సమర్పించారు.