Chandanabhishekam కనులపండువగా చందనాభిషేకం
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:22 PM
Chandanabhishekam as a Visual Feast పార్వతీపురం ప్రధాన రహదారిలోని లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఆదివారం కనులపండువగా చందనోత్సవం నిర్వహించారు. ప్రధాన అర్చకుల వేదమంత్రోశ్చరణల మధ్య స్వామి వారికి విశేష పూజలు చేశారు.
పార్వతీపురం టౌన్, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం ప్రధాన రహదారిలోని లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఆదివారం కనులపండువగా చందనోత్సవం నిర్వహించారు. ప్రధాన అర్చకుల వేదమంత్రోశ్చరణల మధ్య స్వామి వారికి విశేష పూజలు చేశారు. చందనాభిషేకం చేసేందుకు భక్తులు బారులుదీరారు. పట్టణం నుంచి కాకుండా పరిసర గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం ప్రధాన రహదారి బయట ఎండలోనే భక్తులు నిరీక్షించాల్సి వచ్చింది. అనంతరం వారు స్వామిని దర్శించుకుని పులకించిపోయారు. ఈనెల 30న నృసింహ స్వామి నిజరూప దర్శనంతో పాటు వార్షిక కల్యాణమహోత్సం నిర్వహించ నున్నట్లు ప్రధాన అర్చకులు తెలిపారు. భక్తజనం పెద్దసంఖ్యలో హాజరు కావాలని కోరారు.