ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:45 PM
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆయా డివిజన్లు, గ్రామాల్లో విజయవంతం చేసి, కష్టించిన పార్టీ కార్యకర్తలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యద ర్శి నారా లోకేశ్ సంతకాలతో పంపిన లేఖలను అందించారు.
విజయనగరం రూరల్, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆయా డివిజన్లు, గ్రామాల్లో విజయవంతం చేసి, కష్టించిన పార్టీ కార్యకర్తలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యద ర్శి నారా లోకేశ్ సంతకాలతో పంపిన లేఖలను అందించారు. ఈ కార్యక్రమం సోమవారం రాత్రి స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూపార్టీ ఇచ్చిన కార్యక్రమాలను శతశాతం విజయవంతం అయ్యే విధంగా సమష్టిగా ముందుకు సాగాలని కోరారు. విజయనగరం నియోజ కవర్గం పరిధిలో 19 మంది కార్యకర్తలకు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఐవీపీ రాజు, టీడీపీ నాయకులు గంటా రవి, గంటా పోలి నాయుడు, ప్రసాదుల ప్రసాద్, పీతల కోదండరామ్, పాసి అప్పలనాయుడు పాల్గొన్నారు.
ఉత్తమ కార్యకర్తగా గౌరీశ్వరరావు
రాజాం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): మునిసిపాల్టీ పరిధిలోని అమ్మవారి కాలనీకి చెందిన పెంకి గౌరీశ్వర రావును టీడీపీ ఉత్తమ కార్యకర్తగా ఎంపిక చేస్తూ మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి సోమవారం సేవా పత్రం వచ్చిందని ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే.. గౌరీశ్వర రావును అభినందించారు. ఆయనకు ఉత్తమ సేవా పత్రం అందజేసి, సత్కరించారు. టీడీపీ పట్టణ అధ్యక్షు డు నంది సూర్యప్రకాష్‌రావు తదితరులు పాల్గొన్నారు.