Celebrities go to oath ప్రమాణ స్వీకారానికి ప్రముఖులు
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:13 AM
Celebrities go to oath గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్‌గజపతిరాజు బాధ్యతల స్వీకారాన్ని చూసేందుకు జిల్లా నుంచి కూడా అనేక మంది ప్రముఖులు, టీడీపీ నాయకులు వెళ్లారు. ఆదివారం ప్రమాణస్వీకారం అనంతరం అశోక్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రమాణ స్వీకారానికి ప్రముఖులు
గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన అశోక్‌గజపతిరాజు
విజయనగరం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్‌గజపతిరాజు బాధ్యతల స్వీకారాన్ని చూసేందుకు జిల్లా నుంచి కూడా అనేక మంది ప్రముఖులు, టీడీపీ నాయకులు వెళ్లారు. ఆదివారం ప్రమాణస్వీకారం అనంతరం అశోక్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు బహూకరించారు. సతీమణి సునీలా గజపతిరాజు ఆయన వెంటే ఉన్నారు. కాగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు నారా లోకేశ్, గుమ్మిడి సంధ్యారాణి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, పి.రాజేష్ వర్మ, సువ్వాడ రవిశేఖర్, ప్రసాదుల ప్రసాద్, ఆల్తి బంగారుబాబు, బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు, పిళ్లా విజయ్‌కుమార్, అవనాపు విజయ్, భార్గవి తదితరులు హాజరయ్యారు.