భక్తి శ్రద్ధలతో దాడితల్లి పండగ
ABN , Publish Date - May 04 , 2025 | 11:53 PM
మునిసిపాలిటీ పరిధిలో గల గొల్లపల్లి దాడితల్లి అమ్మవారి పండుగ ఆదివారం ఘనంగా ప్రారంభించారు.
బొబ్బిలిరూరల్, మే 4(ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ పరిధిలో గల గొల్లపల్లి దాడితల్లి అమ్మవారి పండుగ ఆదివారం ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా భక్తిశ్ర ద్ధలతో గొల్లపల్లి, ఇందిర మ్మకాలనీ, కృష్ణాపురం, గున్నతో టవలస, రంగరాయపురం, అప్పయ్య పేట తదితర 12 గ్రామాల్లో అమ్మవారి పండగ నిర్వహించారు. అమ్మవారికి పూజలు చేసేం దుకు భక్తులు ఉదయం నుంచే క్యూకట్టారు. భక్తులు ఇబ్బందులు పడకుం డా నిర్వాహ కులు, ఉత్సవ కమిటీ సభ్యులు దాడితల్లి ఆలయం వద్ద ప్రత్యేకఏర్పాట్లు చేశారు. అమ్మవారికి పసుపు కుంకుమలు చెల్లించి ముర్రాటలు పోసి చల్లదనం చేశారు.
పోలీసు బందోబస్తు ఏర్పాటు
బొబ్బిలి, చుట్టుపక్కల 12 గ్రామాలకు ఆదివారం నుంచి దాడి తల్లి అమ్మవారి పండుగ పురస్కరించుకుని డీఎస్పీ ఆదేశాల మేరకు గ్రామాలు, పట్టణంలో పోలీసు బందో బస్తు ఏర్పాటుచేశారు. గ్రామస్థులు, పెద్దలు, కమిటీ సభ్యులు సహకరించాలని సీఐ సతీష్‌కుమార్ కోరారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.